ఈనెల 19వ తేదీన క్రిష్ణగిరి మండలం ఆలంకొండ గ్రామం దగ్గర హంద్రీనీవా సృజల స్రవంతి కాలువ నుండి 68 చెరువులకు నీరుమళ్లించే ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి కార్యక్రమానికి క్రిష్ణగిరి మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ కోరారు. మన వెల్దుర్తి మండలంలోని చెరువులకు కూడా హంద్రీ నీవా కాలువ నుండి నీరు వస్తుందని ఆమె వెల్లడించారు.
