Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్MLA Sridevi: 'గడప-గడపకు మన ప్రభుత్వం' గ్రామ గ్రామానికి ఎమ్మెల్యే

MLA Sridevi: ‘గడప-గడపకు మన ప్రభుత్వం’ గ్రామ గ్రామానికి ఎమ్మెల్యే

పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు

పత్తికొండ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీదేవమ్మ అలుపెరుగని కృషితో పత్తికొండ నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి వారి యొక్క సమస్యలను విని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను వివరిస్తూ లబ్ధి పొందని వారిని గుర్తించి వారికి మేలు చేసే విధంగా గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఇందులో భాగంగా క్రిష్ణగిరి మండలం ఆలంకొండ గ్రామ సచివాలయం పరిధిలోని పెద్దొడ్డి గ్రామంలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ వారు పొందిన లబ్ధిని వివరిస్తూ కరపత్రాలను అందజేశారు.

- Advertisement -

జగనన్న ప్రభుత్వం లంచాలకు ఎలాంటి తావు లేకుండా వాలంటరీ సచివాలయం వ్యవస్థ స్థాపించి పేదలకు దగ్గరగా పనిచేస్తుందని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని, ప్రజలకు కులమత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణగిరి మండల అధికారులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు సచివాలయం సిబ్బంది గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News