Monday, March 3, 2025
Homeఆంధ్రప్రదేశ్MLC Counting: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

MLC Counting: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్(MLC Counting) మొదలైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించడంతో పాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాలో రెండు టీచర్స్, ఓ గ్రాడ్యుయేట్ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. నల్లగొండ కేంద్రంగా వరంగల్-ఖమ్మం-నల్లగొండ టీచర్స్ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కరీంనగర్ వేదికగా మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

- Advertisement -

ఇక ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కృష్ణ- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల కౌంటింగ్ గుంటూరులోని ఏసీ కాలేజీలో జరుగుతోంది. అలాగే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతోంది. కాగా ఒక్కో టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉండనున్నారు. మొత్తం ఫలితాలు వెల్లడికి రెండు రోజులు సమయం పట్టే అవకాశముంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News