Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Mobile teachers: సంచార ఉపాధ్యాయుల నియామకం

Mobile teachers: సంచార ఉపాధ్యాయుల నియామకం

సింగిల్ టీచర్ స్కూల్ సమస్యకు పరిష్కారం మొబైల్ టీచర్స్

ఆంధ్రప్రదేశ్ లో సంచార ఉపాధ్యాయుల నియామకం జరుగుతోంది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఏ కారణం చేతనైనా సెలవు పెట్టినప్పుడు విద్యాభ్యాసం, విద్యాబోధన ఆగకుండా నిర్విఘ్నంగా, నిర్విరామంగా కొనసాగడానికి ఈ ఏర్పాటు చేపట్టడం జరుగుతోందని విద్యాశాఖ అధికారులు
తెలిపారు. ఇంతకు ముందు ఉపాధ్యాయులు లేనప్పుడు క్లస్టర్ రిసోర్స్ టీచర్లను నియమించడం జరిగేది. ఇప్పుడు అదే స్థానంలో క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లను నియమించడం జరుగుతుంది. ఏకోపాధ్యాయులకు వీరు ప్రత్యామ్నాయంగా వ్యవహరిస్తారు.

- Advertisement -

పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ అందజేసిన వివరాల ప్రకారం, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో టీచర్లు సెలవులను ఉపయోగించుకోవడం, ఏదో కారణం మీద సెలవు పెట్టడం వంటివి జరిగినప్పుడు చదువు చెప్పడం అనేది అస్తవ్యస్తం అవుతోంది. సెలవు కాలంలో చదువు చెప్పడం ఆగిపోతోంది. దీనివల్ల విద్యార్థులు దెబ్బతినడం జరుగుతోంది. ఈ పరిస్థితిని నివారించడానికి ప్రభుత్వం కొందరు ఉపాధ్యాయులతో సంచార ఉపాధ్యాయ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఏకోపాధ్యాయుడు సెలవు పెట్టినప్పుడు లేదా ఏదో ఒక కారణంపై స్కూలుకు రాలేనప్పుడు వెంటనే ఈ బృందం నుంచి అక్కడికి ఒక టీచర్ ను పంపించి విద్యాబోధనను కొనసాగించడం జరుగుతుంది.

అధికారుల నుంచి ఆదేశాలు రాగానే ఈ బృందం నుంచి టీచర్ వెళ్లి విద్యాబోధనను కొనసాగించడం జరుగుతుంది. పాఠశాల స్థాయిలో ఈ బృందం పని చేస్తూ ఉంటుంది. ఒక్కో సంచార ఉపాధ్యాయుడికి నాలుగైదు పాఠశాలలు అప్పగించడం జరుగుతుంది. ప్రస్తుతం ఇటువంటి టీచర్లు అటు హెడ్మాస్టర్లకు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లకు రిపోర్టు చేయాల్సి వస్తున్నందువల్ల కొద్దిగా గందరగోళం ఏర్పడుతోంది. ఈ వ్యవస్థకు ఇక స్వస్తి చెప్పడం జరుగుతుంది. ఈ స్థానంలో సంచార ఉపాధ్యాయుల బృందం ఏర్పడుతుంది. ఈ బృందం నుంచి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంటనే ఒకరిని ఎంపిక చేసి ఆ ఏకోపాధ్యాయ పాఠశాలకు పంపించడం జరుగుతుంది.

ఇందుకోసం స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కలిసి ఒక హాజరు పట్టీని కూడా నిర్వహిస్తారు. తమ ఆదేశాలు అమలయిందీ లేనిదీ వీరు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. రాష్ట్రంలో 9602 ఏకోపాధ్యాయ పాఠశాలలు పనిచేస్తున్నాయి. అందులో 3499 మంది సంచార ఉపాధ్యాయులు పని చేయడం జరుగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News