Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Assembly elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 83% పైగా పోలింగ్ జరగాల్సిందే

AP Assembly elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 83% పైగా పోలింగ్ జరగాల్సిందే

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 83 శాతం పైగా పోలింగ్ నమోదు లక్ష్యంగా ఓటర్ల విద్య మరియు ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాలను పటిష్టంగా అమలు పరుస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో అమలు చేయబడుచున్న క్రమబద్దమైన ఓటర్ల విద్య మరియు ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాలను (SVEEP – Systematic Voters’ Education & Electoral Participation) సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం స్వీప్ అధికారుల బృంధం సి.ఇ.ఓ. ముఖేష్ కుమార్ మీనాను మర్యాద పూర్వకంగా వారి చాంబరులో మంగళవారం కలిసింది.

- Advertisement -

ఈ సందర్బంగా సి.ఇ.ఓ. ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ 2019 లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సగటున 79.77% పోలింగ్ నమోదు అవ్వగా, జాతీయ స్థాయిలో 69% పోలింగ్ నమోదు అయినట్లు తెలిపారు. అయితే రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 83% పైగా పోలింగ్ నమోదు అయ్యే లక్ష్యంతో స్వీప్ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో అమలు పర్చడం జరుగుచున్నదన్నారు.

రాష్ట్రంలోని ప్రతి పౌరునికి, ఓటరునికి ఎన్నికల ప్రక్రియపై సమగ్ర అవగాహన కలిగించి, రానున్న ఎన్నికల్లో వారిని పెద్ద ఎత్తున బాగస్వామ్యులను చేసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్వీప్ కార్యక్రమాలను ప్రణాళికా బద్దంగా అమలు చేయడం జరుగుచున్నదన్నారు. ఇందుకై ఇప్పటికే అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను మరియు స్వీప్ నోడల్ అధికారులను అప్రమత్తం చేయడమే కాకుండా జిల్లాల వారీగా స్వీప్ కార్యక్రమాల నిర్వహణపై తరచుగా సమీక్షలను నిర్వహించడం జరుగుచున్నదని భారత ఎన్నికల సంఘం స్వీప్ అధికారుల బృంధానికి సి.ఇ.ఓ. ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

భారత ఎన్నికల సంఘం స్వీప్ అధికారుల బృంధం సభ్యులు సంతోష్ కుమార్ (కార్యదర్శి), రాహుల్ కుమార్, ఆర్.కె.సింగ్ తో పాటు అదనపు సీఈవో ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్ ఈ చర్చల్లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News