HomeTop StoriesCrime: పాల కోసం ఏడ్చిన చిన్నారి.. క్షణికావేశంలో గొంతు నులిమి చంపిన కసాయి తల్లి

Crime: పాల కోసం ఏడ్చిన చిన్నారి.. క్షణికావేశంలో గొంతు నులిమి చంపిన కసాయి తల్లి

Mother Kills Infant Daughter: నవమాసాలు మోసి కనిపెంచిన బిడ్డని చీమ కుట్టినా ఓర్చుకోలేదు కన్న తల్లి. చిన్న ఆపద ఎదురైనా తట్టుకోలేదు. కానీ.. ఇటీవలి కాలంలో అమ్మలకు ఓపిక నశిస్తోంది. కడుపారా కన్న బిడ్డ ఆకలితో ఏడ్చినా, మరేదైనా సమస్యతో గుక్క పట్టినా క్షణం కూడా ఓర్చుకోలేకపోతున్నారు. క్షణకావేశంలో గొంతు నులిమి చంపేస్తున్నారు. కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లో ఓ పసికందు రాత్రి నుంచి గుక్క పట్టి ఏడుస్తున్నాడనే కారణంతో ఓ తల్లి కట్టెల పొయ్యిలో వేసి కాల్చి చంపేసింది. తాజాగా అలాంటి ఉదంతమే తిరుపతిలో చోటుచేసుకుంది.  

- Advertisement -

Also Read: https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-wife-anna-lezhneva-pens-emotional-note-on-chiranjeevi-and-naga-babu/

తిరుపతి జిల్లాలో పాల కోసం ఏడుస్తోందని కన్న కూతురినే గొంతు నులిమి చంపింది తల్లి. సత్యవేడు మండలంలోని నరసరాజు అగ్రహారంలో ఆరు నెలల పసికందు పాల కోసం ఏడుస్తోందనే కోపంతో ప్రాణం తీసింది. తమిళనాడులోని వెంగలచేరికి చెందిన హైమావతి, వెంకటేశ్‌ దంపతులు సత్యవేడు పరిసరాల్లో సిమెంట్‌ ఇటుకల తయారీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు రుత్విక్‌, ఆరు నెలల ఆడబిడ్డ ఉన్నారు. 

Also Read: https://teluguprabha.net/gallery/regina-cassandra-looks-stunning-in-her-latest-photoshoot/

గురువారం చిన్నారి పాల కోసం ఏడుస్తుండటంతో క్షణికావేశానికి గురైన తల్లి గొంతు నులిమి చంపేసింది. గమనించిన పోలీసులు స్థానికులకు సమాచారం అందించారు.  పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News