Monday, June 9, 2025
Homeఆంధ్రప్రదేశ్Mudragada: క్యాన్సర్ అంటూ కుమార్తె వ్యాఖ్యలపై ముద్రగడ ఆగ్రహం

Mudragada: క్యాన్సర్ అంటూ కుమార్తె వ్యాఖ్యలపై ముద్రగడ ఆగ్రహం

వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి(Mudragada Padmanabham)క్యాన్సర్‌తో పోరాడుతున్నారని ఆయన కుమార్తె క్రాంతి(Kranthi) సంచనల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళనకరంగా ఉందని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ పోస్టులో ఆమె సోదరుడు, ముద్రగడ కుమారుడు గిరిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే తాజాగా ఆమె వ్యాఖ్యలపై ముద్రగడ ఘాటుగా స్పందించారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

‘మా కుటుంబంపై మరో కుటుంబం కొంతకాలంగా దాడి చేస్తుంది. మా కుటుంబాల మధ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. వీళ్లతో ఏడాది నుంచి రాకపోకలు కూడా ఆగిపోయాయి. మా చిన్నాబ్బాయి ఎదుగుదల చూసి కొందరు దారుణంగా ఏడుస్తున్నారు. వారితో మాకు ఏమాత్రం సంబంధం లేదు. నాకు క్యాన్సర్ వచ్చిందని, నా చిన్న కొడుకు పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రేలాపన చేస్తున్నారు. నాకు, నా కొడుకుకు మధ్య మనస్పర్థలు పెంచి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని జన్మలెత్తినా వారి గుమ్మం ఎక్కను.

నాకు, నా వియ్యంకుడుకి మధ్య మనస్పర్థలు తేవాలని చూస్తున్నారు. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు మానుకోండి. నా కొడుకునే కాదు.. మనవడిని కూడా రాజకీయాల్లోకి తీసుకెళ్తాను. వారిని ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను. నాపై ఎవరో ఏడుస్తున్నారని రాజకీయాలను వదిలిపెట్టను. తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి.. పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు. వయసు రీత్యా నాకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి తప్ప.. మరేవీ లేవు. గతంలో నా భార్యకు క్యాన్సర్ వచ్చినప్పుడు వారింటికి వెళ్తే ఐదు నిమిషాలు కూడా మా వద్దకు రావద్దని కూతురు, అల్లుడు చెప్పారు. వీళ్లా ఈరోజు మాట్లాడేది. ఏం ఆశించి నన్ను టార్గెట్ చేస్తున్నారు. వీరు బెదిరిస్తే బెదిరి పోతానా?

ప్రభుత్వ జీవోలపై ఆ​ కుటుంబం వారు సలహా ఇచ్చామని అంటున్నారు. మీకు అంత దమ్ము, ధైర్యం ఉంటే కాపులను బీసీల్లో కలిపి కార్యక్రమం చేయించండి. సూపర్ సిక్స్ పథకాలు ముఖ్యమంత్రి గారితో అమలు చేయించండి. పథకాలు అమలు చేపించి చూపించండి.. అప్పుడు మీ డబ్బా కొట్టుకోండి. మీ చీప్ పబ్లిసిటీ కోసం ఇంతగా దిగజారి బతకొద్దు. ఎన్ని జన్మలెత్తినా మీకు మాకు సంబంధాలు ఉండవు. అనవసరంగా నా ప్రస్తావన తేవద్దు” అని లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News