Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Muharram: మొహరం వేడుకల్లో కోట్ల సుజాతమ్మ

Muharram: మొహరం వేడుకల్లో కోట్ల సుజాతమ్మ

ఆలూరు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న మొహరం వేడుకలలో కర్నూలు జిల్లా టిడిపి నాయకులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు… మొహరం పండుగ సందర్బంగా ఆలూరు నియోజకవర్గం హల్వహరి మండలం, కామినహాల్ గ్రామంలోని ఉహ్సేన్ హసీన్ దర్గాను కర్నూల్ జల్లా టీడీపీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి టి నాయుడు, మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి. ఆలూరు టీడీపీ ఇంచార్జ్ , మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, ఆదోని టీడీపీ నాయకుడు ఉమాపతి నాయుడు, దర్శించుకున్నారు… టిడిపి నాయకులకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు.. టిడిపి నాయకులు దర్గాలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, మొహరం వేడుకలను సోదరభావంతో జరుపుకోవాలని టిడిపి నాయకులు కోరారు.. ఈ సందర్భంగా నిర్వాహకులు, గ్రామ నాయకులు జిల్లా నాయకులను ఘనంగా సత్కరించారు… వారి వెంట మండలాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News