Mukunda Jewellers Visakha: ప్రముఖ ‘ముకుందా జ్యువెలర్స్’.. ఆంధ్రప్రదేశ్‌లో తన తొలి షోరూంను ప్రారంభించింది. ఇందుకోసం విశాఖను వేదికగా ఎంచుకుంది. రాష్ట్రంలో వివాహాది శుభకార్యాల కోసం ప్రత్యేకమైన డిజైన్లు, కలెక్షన్లతో విశాఖపట్నంలో ‘ముకుందా జ్యువెలర్స్’ కొలువుదీరింది. ముకుందా జ్యువెలర్స్‌ను ప్రముఖ పారిశ్రామికవేత్త ముప్పిడి వెంకటరావు ప్రారంభించారు.

విశాఖ మహా నగరంలో మరో పెద్ద ఆభరణాల దుకాణం ప్రారంభమైంది. ఆశీలుమెట్ట కూడలిలోని సంపత్ వినాయక ఆలయం సమీపంలో శనివారం ‘ముకుందా జ్యువెలర్స్’ షోరూంను ప్రముఖ పారిశ్రామికవేత్త ముప్పిడి వెంకటరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముకుందా ఛైర్మన్, ఫౌండర్ నరసింహారెడ్డి మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌లో తమ తొలి షోరూంను విశాఖపట్నంలో ప్రారంభించడం ఆనందంగా ఉందని నరసింహారెడ్డి అన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా కస్టమర్ల కోసం అద్భుతమైన ఆఫర్లు అందిస్తున్నట్లు చెప్పారు. రూ. లక్షకు పైగా ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి ఐదు గ్రాముల సిల్వర్ బహుమతి అందిస్తామని పేర్కొన్నారు. లైట్ వెయిట్ జ్యువెలర్స్ తయారు చేయడంలో ముకుంద అగ్రగామి అని ఆయన స్పష్టం చేశారు. విశాఖలో తాము ప్రారంభించిన ఈ షోరూoను సందర్శించి తమను ఆశీర్వదించాలని కోరారు. తమ వ్యాపారభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ttd-annual-budget-rs-5456-trustees-approved/
ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు, 27వ వార్డు కార్పొరేటర్ గొలగాని వీరారావు, ముకుందా సంస్థ డైరెక్టర్ కృష్ణ, డాక్టర్ నిఖితా రెడ్డి, బృందారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

