ఎమ్మిగనూరు శాసన సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్థుల పేర్లు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఎమ్మిగనూరు సీటు కోసం టిడిపిలో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి, మచాని డాక్టర్ సోమనాథ్, కొంకతి లక్ష్మీనారాయణలు ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నారు. ఇదిలా ఉండగా టిడిపి, బిజేపి, జనసేన పొత్తులు ఖరారు అయితే ఎమ్మిగనూరు బిజేపి కన్వీనర్ కేఅర్ మురహరి రెడ్డికి వచ్చే అవకాశం ఉందని ప్రజలు బావిస్తున్నారు. వైకాపా బిసి అభ్యర్థి బుట్టా రేణుకకు కేటాయించింది. టిడిపి కూడా బిసిలకు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం.
మురహరి విజయం ఖాయమని కాషాయం భావన..
మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డిను కాదని బీసీకు ఇచ్చే అవకాశం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కేఅర్ మురహారి రెడ్డిని ఎమ్మిగనూరు అభ్యర్థిగా పెడితే విజయం సాధించే అవకాశం ఉందని బిజేపి రాష్ట్ర అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేఅర్ మురహరి రెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఉన్నాడు. బిజేపి కన్వీనర్ గా ఉంటూ నియోజకవర్గంలో 271 బూత్ లు, శక్తి కేంద్రాలు, పార్టీతో పాటు అనుబంధ సంఘాల కమిటీలను ఏర్పాటు చేసి బిజేపిను బలోపేతం చేశారు. 2019 ఎన్నికలలో బిజేపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికలలో ఓడిపోయినప్పటికి ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలపై గళం వినిపించారు. ఎమ్మిగనూరు తేరు బజార్ లో జరిగిన కేంద్ర మంత్రి సభకు 10 నుండి 12 వేలు మంది హాజరు అయ్యారు. దీంతో బిజేపి అధిష్టానం దృష్టిలో ప్రజాదరణ పొందిన నాయకుడిగా గుర్తించపడ్డాడు.
పెద్దల ఆశిస్సులు, అన్ని వర్గాలు అభిమానం..
బిజేపి పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. మురహరి రెడ్డికి పొత్తులో భాగంగా సీటు వస్తే టిడిపి, జనసేనతో పాటు వైకాపా శ్రేణులకు చెందిన వారు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. మురహరి రెడ్డి ఎమ్మిగనూరు పరిశ్రమలు ఏర్పాటు చేసి అనేక మందికి ఉపాధి కల్పించారు. ఎస్సీ ఎస్టీ బీసీ, మైనారిటీలతో పాటు రెడ్డి, అగ్రవర్ణాలు సహకారం ఇస్తారని ప్రజలు బావిస్తున్నారు. గత నెల రోజులుగా మచాని సోమనాథ్, బీవీ జయనాగేశ్వర రెడ్డి మధ్య పోటీ వుందనుకున్నారు. కానీ కొత్తగా మురహరి రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. బిజేపి, టిడిపి, జనసేనల పొత్తు కుదిరితే ఎమ్మిగనూర్ సీటు మురహరి రెడ్డికి దక్కే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా బీవీ జయనాగేశ్వర రెడ్డిను టిడిపి అధిష్ఠానం పిలిపించి సీటుపై చర్చించినట్లు తెలిసింది. జిల్లాలో ఎమ్మిగనూరు సీటు ఉత్కంఠగా మారుతుంది. కూటమి తరపున మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డికి వస్తుందా లేక డాక్టర్ సోమనాథ్ వరిస్తుందా వీరిని కాదని పొత్తు కుదిరితే కేఅర్ మురహరి రెడ్డికు వస్తుందా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.