Sunday, March 9, 2025
Homeఆంధ్రప్రదేశ్Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్‌ దాఖలు

Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్‌ దాఖలు

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు(Nagababu) నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ అధికారిణి వనితారాణికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేశ్‌, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

- Advertisement -

కాగా జనసేన నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖరారుచూసిన సంగతి తెలిసిందే. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నాదెండ్ల మనోహర్, పంచకర్ల రమేశ్ బాబు, పత్సమట్ల ధర్మరాజు, లోకం మాధవి, ఆరణి శ్రీనివాసులు, మండలి బుద్ధ ప్రసాద్, విజయ్ కుమార్, బత్తుల రామకృష్ణ, పంతం నానాజీ, ఆరవ శ్రీధర్ సంతకాలు చేశారు. నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News