Monday, December 9, 2024
Homeఆంధ్రప్రదేశ్Nagababu: దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్‌ గేమ్ ఛేంజర్: నాగబాబు

Nagababu: దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్‌ గేమ్ ఛేంజర్: నాగబాబు

Nagababu| మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ప్రచారంలో మహాయుతి కూటమి తరపున జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) పాల్గొన్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. పవన్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. ఈ క్రమంలోనే పవన్‌ను పొగుడుతూ ఆయన సోదరుడు, జనసేన నేత నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

- Advertisement -

‘గెలిచే ప్రతి నాయకుడు హీరోనే, కానీ ప్రతి హీరో నాయకుడు కాలేడు. నాయకుడంటే గెలిచే వాడే కాదు. నమ్మిన సిద్ధాంతాల కోసం సైధ్దాంతిక విలువల కోసం. అవి నమ్మి నడిచే వ్యక్తుల కోసం. నీడై నిలబడేవాడు. తోడై నడిపించేవాడు. వారి గమ్యంలో గెలుపుని చూసుకునే వాడు. వారి గెలుపులో మరో గమ్యాన్ని వెతుక్కునే వాడు. అలాంటి అరుదైన నాయకుడే నా నాయకుడు.ప్రస్తుతం దేశ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ పవన్ కల్యాణ్’ అంటూ నాగబాబు ప్రశంసలు కురిపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News