Monday, December 9, 2024
Homeఆంధ్రప్రదేశ్Nagababu: సోషల్ మీడియా వినియోగంపై నాగబాబు కీలక వ్యాఖ్యలు

Nagababu: సోషల్ మీడియా వినియోగంపై నాగబాబు కీలక వ్యాఖ్యలు

Nagababu| ప్రస్తుతం ఎక్కడ చూసినా సోషల్ మీడియా(Social Media)వాడకం ఎక్కువైపోతుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. దీంతో పిల్లల్లో చెడు ప్రభావం ఎక్కువైపోతుంది. చదువు కంటే మిగిలిన అంశాల పట్ల ఆకర్షితులు అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుఎంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించుకుండా కొత్త చట్లం తీసుకువచ్చింది. ఈ చట్టానికి ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోద ముద్ర వేసింది. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై జనసేన నేత నాగబాబు(Nagababu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘నేటి పిల్లలు సోషల్ మీడియా చట్రంలో చిక్కుకుని భవిష్యత్తును చేజార్చుకుంటున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్ని దేశాలకి ఆదర్శం. అన్ని దేశాలూ దీన్ని అనుసరిస్తే మనం మంచి సమాజాన్ని, జాతిని, ప్రపంచాన్ని చూస్తాం’ అని వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News