Friday, March 14, 2025
Homeఆంధ్రప్రదేశ్Nagababu: సీఎం చంద్రబాబుకు నాగబాబు కృతజ్ఞతలు

Nagababu: సీఎం చంద్రబాబుకు నాగబాబు కృతజ్ఞతలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్(Pawan Kalyan)‌ సోదరుడు, జనసేన నేత నాగబాబు(Nagababu) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. ఈ సందర్భంగా తాను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా నాగబాబు అభినందనలు తెలిపారు. తనతో పాటుగా ఎన్నికైన ఇతర ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.

- Advertisement -

“ప్రభుత్వ పరిపాలనలో ప్రజా సేవ చేసేందుకు గాను.. ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎన్నికయ్యే అకవాశం కల్పించి.. నా బాధ్యతను పెంచారంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కు కృతజ్ఞతలు తెలిపారు.. ఇక, నాతో పాటు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన గ్రీష్మ ప్రసాద్, సోము వీర్రాజు, తిరుమల నాయుడు, బీద రవిచంద్రకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. నామినేషన్‌ దాఖలు సందర్భంగా నాతో వెన్నంటి ఉన్న మంత్రులు నాదెండ్ల మనోహర్‌, నారా లోకేష్‌, పి. విష్ణుకుమార్‌ రాజు, కొణతాల రామకృష్ణ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు.. నా అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకాలు చేసిన నాదెండ్ల మనోహర్‌, మండల బుద్ధప్రసాద్‌, లోకం నాగ మాధవి, ఆరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్‌, ధర్మరాజు, అరవ శ్రీధర్‌, బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీ గారికి అభినందనలు తెలిపారు.. నా ఇన్నేళ్ల రాజకీయ ప్రయాణంలో నాతో కలిసి పని చేసిన సహచరులకు, మిత్రులకు, మీడియా ప్రతినిధులు.. ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, మొత్తం జనసేన కుటుంబానికి ఆత్మీయ అభినందనలు” తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News