Nagula Chavithi: కార్తిక మాసంలో మొదటగా వచ్చే నాగుల చవితి హిందూ పండుగల్లో ఎంతో ప్రత్యేకం. భక్తి శ్రద్ధలతో నాగదేవత పుట్టలకు పూజ చేసి, పాలు పోసి, నైవేద్యం సమర్పించి మనస్ఫూర్తిగా వేడుకుంటారు. ఇక శివాలయాల్లోనూ అభిషేకాలు, ప్రత్యేక పూజలతో ఆలయాలన్నీ కిటకిటలాడుతుంటాయి. ఆడపడుచులందరూ తప్పకుండా ఆలయాలకు వెళ్లి పుట్ట చుట్టూ పసుపు, కుంకుమలతో అలంకరించి సౌభాగ్యాన్ని వేడుకుంటారు. నాగదేవత కటాక్షంతో సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక నాగుల చవితి రోజు పలు ఆలయాల్లో కొన్ని అద్భుత ఘటనలు కూడా చోటుచేసుకోవడం చూస్తుంటాం. తాజాగా అలాంటి సంఘటనలే రెండు చోట్ల చోటుచేసుకున్నాయి.
Also Read: https://teluguprabha.net/sports-news/india-won-by-9-wickets-against-australia-3rd-odi/
ఈ రోజు(శనివారం) నాగుల చవితి సందర్భంగా నెల్లూరు జిల్లాలోని మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని విశ్వనాథస్వామి దేవస్థానంలో అద్భుత ఘటన చోటుచేసుకుంది. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలో గుడి ప్రాంగణంలోని శివలింగంపైకి రెండు నాగుపాములు కొలువు దీరాయి. తర్వాత రెండు పాములు పడగ విప్పి నిల్చుని నాట్యం చేశాయి. శివలింగంపై కొలువుదీరిన రెండు నాగదేవతలను భక్తులు పరవశించిపోయారు.
శ్రీకాకుళం జిల్లాలోని పలాస మున్సిపాల్టీ శాసనం కాలనీలో నాగులచవితి సందర్భంగా భక్తులకు నాగు పాము దర్శనమిచ్చి కనువిందు చేసింది. శనివారం ఉదయం కాలనీలోని ఓ చెట్టు కింద పుట్ట వద్ద భక్తులు పాలు, గుడ్లు, నైవేద్యం పెట్టి పూజలు నిర్వహించారు. అయితే ఆ కాసేపటికే అద్భుతం చోటుచేసుకుంది. పుట్టలోనుంచి పాము బయటకు రావడంతో అది చూసిన భక్తులు చేతులెత్తి వేడుకున్నారు. కాసేపటికి బయటకు వచ్చిన పాము.. అటు ఇటు తిరిగి పుట్ట వద్ద పాత్రలోని పాలను తాగింది. దీంతో భక్తులు పుట్ట ప్రాంగణమంతా పసుపు కుంకుమతో అలంకరణ చేశారు.
Also Read: https://teluguprabha.net/national-news/lic-clarifies-on-adani-group-investments/
అయితే నిజానికి పాములు పాలు తాగుతున్నట్లు అనిపించినా శాస్త్రీయంగా అది వాస్తవం కాదని నిపుణులు చెబుతున్నారు. పాలను జీర్ణం చేసుకునే శక్తి ఉండదని.. అసలు వాటికి జీర్ఱవ్యవస్థ ఉండదని వెల్లడించారు. పాములు కేవలం పాలల్లో తల ఆన్చుతాయని.. అంతుకానీ పాలు తాగే అవకాశం లేదని పేర్కొంటున్నారు. ఎలుకలు, బల్లులు, గుడ్లు, చిన్న చిన్న కీటకాలను మాత్రమే తింటాయని.. పాములు పాలుతాగవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


