” శ్రీశైల క్షేత్రానికి పాదయాత్రగా తరలివచ్చే భక్తుల హృదయాంతరాలలో నేనున్నాను.. వారి ఆకలి తీర్చడంలో అశేష పుణ్యఫలం లభిస్తుంది” అని శివపురాణంలో స్వయాన ఆ పరమాత్ముడే పేర్కొన్నాడని ప్రతీతి. కలియుగంలో కాశీ అన్నపూర్ణేశ్వరి సాక్షాత్తూ ఆ పరమాత్మునికే అన్న సంతర్పణ చేసింది. ప్రయాగలో లక్షమందికి, కాశీలో కోటి మందికి అన్నదానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో.. శ్రీశైల మహాక్షేత్రంలో ఒక్కరికి అన్నదానం చేసినా అంతటి పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రాంతంలో భక్తులకు అన్న ప్రసాదం లోటు లేకుండా ఊరూరా అన్న ప్రసాదాల పంపిణీ పాదయాత్రికుల కోసం సాగుతూనే ఉంటుంది.
శ్రీశైల ఉగాది ఉత్సవాలకు తరలివచ్చే కన్నడ శివభక్తులు ఆకలి తీర్చేందుకు అన్నదాన నిర్వహిస్తూ.. ఎన్నో ఏళ్లుగా పరమ శివుడి సేవలో తరిస్తున్నారు శ్రీ గురుదేవ్ బ్రమరాంబ మల్లికార్జున చారిటబుల్ ట్రస్ట్ నిర్వహకులు, వ్యయప్రయాసలకోర్చి కొండాకోనల్లో భోజనాలు అందిస్తున్నారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని నల్లమల అభయారణ్యం నాగలూటి శ్రీ రామ ఆలయం వద్ద పూజ్య స్వామీజీ శ్రీ యతీశ్వరనంద మహా స్వామీజీ ఆశీస్సులతో శ్రీ గురుదేవ్ బ్రమరాంబ మల్లికార్జున చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మల్లికార్జున బి పాటిల్, సెక్రటరీ సిడ్రం ఎల్ బిస్నాల ల పర్యవేక్షణ లో ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైలానికి తరలివచ్చే కన్నడ భక్తుల మహా అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సుమారు 5 లక్షల మందికి పైగా భక్తులకు ఉచితంగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనంతో పాటు మజ్జిగ, పాయసం, సజ్జ జ్యూస్, షర్బత్, డ్రై ఫ్రూట్ అందిస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్ర లో అస్వస్థతకు గురైతే తక్షణం చికిత్స అందించేందుకు ఇద్దరు డాక్టర్లను అందుబాటులో ఉంచి మెడిసిన్స్ అందిస్తున్నారు. భక్తులకు సేవ చెయ్యడం అంటే పరమేశ్వరుడిని సేవించినట్లని స్వామీజీ యతీశ్వరనంద స్వామీజీ పేర్కొన్నారు.
Nallamala: అడవుల్లో పాదయాత్ర భక్తులకు అన్నదానం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES