నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు ఇటీవల పద్మభూషణ్ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హిందూపురంలో మాట్లాడిన బాలయ్య.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌పై స్పందించారు. “నాకు పద్మభూషణ్ కాదు.. నాన్నకు భారతరత్న ఇవ్వాలి. NTRకు భారతరత్న కోట్లాది మంది తెలుగు ప్రజల ఆకాంక్ష. దాన్ని తెలుగు ప్రజలు సాధిస్తారని నా ధీమా” అని అటూ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చే వరకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు. పద్మభూషణ్ అవార్డు రావడం తనలో మరింత కసి పెంచిందన్నారు. తన రెండో ఇన్నింగ్స్ ఇక్కడి నుంచి మొదలైందని చెప్పారు. తనకు ప్రతీ పాత్ర ఛాలెంజ్‌గా ఉంటుందన్నారు. “నాకెవరూ ఛాలెంజ్ కాదు… నాకు నేనే ఛాలెంజ్” అని వెల్లడించారు. కాగా బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.