Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Nandamuri Balakrishna: అసెంబ్లీలో రెచ్చిపోయిన బాలయ్య.. వైఎస్‌ జగన్‌, చిరంజీవిపై ఘాటు వ్యాఖ్యలు

Nandamuri Balakrishna: అసెంబ్లీలో రెచ్చిపోయిన బాలయ్య.. వైఎస్‌ జగన్‌, చిరంజీవిపై ఘాటు వ్యాఖ్యలు

Nandamuri Balakrishna On Ys Jagan Mohan Reddy Over Chiranjeevi Issue: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు హీటెక్కిస్తున్నాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గురువారం హిందూపూర్‌ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం చెలరేగింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఓ విషయం చర్చకు రాగా.. మాజీ సీఎం జగన్‌, సినీ నటుడు చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి. అసలు విషయానికి వస్తే.. గత వైసీపీ హయాంలో సినీ ప్రముఖులు మాజీ సీఎం జగన్‌ను కలిసిన విషయంలో హిందూపూర్‌ ఎమ్మెల్యే బాలకృష్ణ కోపంతో ఊగిపోయారు. మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు.. బాలకృష్ణ కౌంటర్ ఇస్తూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో సినీ పెద్దలు అప్పటి సీఎం జగన్‌ను కలిసిన వ్యవహారంపై ఆయన ప్రస్తావిస్తూ.. మాజీ సీఎం జగన్‌ను సైకో అంటూ సంబోధించారు. అదే సమయంలో చిరంజీవిపైనా పరోక్ష విమర్శలు చేశారు. ఇటీవల సీఎంను కలిసే జాబితాలో తన పేరును 9వ పేజీ చివర్లో చేర్చడంపైనా.. బాలకృష్ణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు వివాదానికి కారణమేంటో చూస్తే.. సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ సినిమా ఇండస్ట్రీని, సినీ పెద్దలను పట్టించుకోలేదని కామినేని శ్రీనివాసరావు ఆరోపించారు. అంతేకాకుండా చిరంజీవిని.. గతంలో జగన్ అవమానించారని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, ఆర్‌ నారాయణమూర్తి సహా పలువురు అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ను కలిసేందుకు వెళ్లగా.. వారిని గేటు వద్దే ఆపేశారని.. సీఎం కాకుండా సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి కలుస్తారని చెప్పినట్లు మాజీ మంత్రి కామినేని వెల్లడించారు. అయితే, ఆ సమయంలో చిరంజీవి సీరియస్ అవ్వడంతోనే, ఆయన ఒత్తిడికి తలొగ్గి జగన్ దిగి వచ్చి మాట్లాడినట్లు తెలిపారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/business/bank-holidays-in-october/

జగన్‌ను గట్టిగా నిలదీశారనేది అవాస్తవం..

అయితే, ఈ విషయంలో కామినేని చేసిన వ్యాఖ్యలు అబద్దం అంటూ బాలకృష్ణ కొట్టిపారేశారు. చిరంజీవి గట్టిగా నిలదీశారు అనేది అవాస్తవమని, చిరంజీవికి ఒత్తిడికి తలొగ్గి వైఎస్ జగన్ దిగి వచ్చారనేది అవాస్తవమని తేల్చి చెప్పారు. వైఎస్ జగన్‌ను ఆ సమయంలో ఎవరూ గట్టిగా అడగలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం వైఎస్ జగన్‌ను బాలకృష్ణ.. అసెంబ్లీ వేదికగా సైకో అని ప్రస్తావించడం తీవ్ర దుమారం రేపుతోంది. అదే సమయంలో చిరంజీవి గట్టిగా నిలదీయలేదని పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా తనను అవమానించిందని బాలకృష్ణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సమావేశంలో తన పేరును 9వ స్థానంలో పెట్టడం ఏంటని బాలకృష్ణ ఫైర్ అయ్యారు. ఆ లిస్ట్ తయారు చేసింది ఎవడాడు? అంటూ ఏక వచనంతో సంబోధించారు. అధికార ఎమ్మెల్యే అయిన తనకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇదే విషయానికి సంబంధించి.. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కు తాను ఫోన్ చేసి మరీ అడిగినట్లు సభలో బాలకృష్ణ వెల్లడించారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad