Nandamuri Balakrishna : హిందూపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని స్థానిక ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హామీ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం తుమ్మలకుంట గ్రామంలో పర్యటించిన ఆయన, అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
గత వైసీపీ ప్రభుత్వం హిందూపురాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని బాలకృష్ణ తీవ్రంగా ఆరోపించారు. ముఖ్యంగా వైద్యరంగంలో వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. మెడికల్ కళాశాలల విషయంలో వైసీపీకి చిత్తశుద్ధి లేదని, మళ్లీ అధికారంలోకి రావాలనే ఉబలాటంతోనే ఇప్పుడు పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) మోడల్‌పై వ్యర్థ ప్రసంగాలు చేస్తున్నారని మండిపడ్డారు.
హిందూపురం అభివృద్ధికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేస్తుందని, గతంలో తాము ప్రారంభించిన అభివృద్ధి పనులను కొనసాగించి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని ఆదర్శంగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు బాలకృష్ణకు ఘన స్వాగతం పలికారు

