Wednesday, November 12, 2025
Homeఆంధ్రప్రదేశ్Tdp : నందమూరి కుటుంబంలో ఆయన ఒక్కడే కదా..!

Tdp : నందమూరి కుటుంబంలో ఆయన ఒక్కడే కదా..!

Balakrishna : తెలుగుదేశం పార్టీ పెట్టింది నందమూరి తారక రామారావు. ఆయన కేవలం తొమ్మిది నెలలలో పార్టీని అధికారంలోకి తెచ్చారు. తెలుగుదేశం ఈ రోజుకి పటిష్టంగా ఉండేలా దిట్టమైన పునాది వేసింది ఎన్టీఆర్ అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు.కాని.. కొన్ని కారణాల వల్ల ఆయనను గద్దె దించేసిన తరువాత టీడీపీ అధినేతగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు.

- Advertisement -

అయితే హరికృష్ణ టీడీపీలో కీలకం అవుతారు అని కొత్తల్లో అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కాకుండానే రవాణా మంత్రిగా చేశారు. కానీ ఆరు నెలలలోగా ఎమ్మెల్యే కాకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది తీరా ఎమ్మెల్యేగా నెగ్గాక మళ్ళీ ఆ మంత్రి పదవి దక్కలేదు. ఆ విధంగా హరిక్రిష్ణ టీడీపీకి దూరం అయ్యారు. 2009 ఎన్నికల వేళ తిరిగి కలిసి రాజ్యసభ మెంబర్ గా కూడా ఆయన విభజన ఉద్యమంలో రాజీనామ చేశారు. ఇక ఆయన 2018లో మరణించే సమయానికి పార్టీలో అసలు లేరనే చెప్పాలి.ఇక విభజన ఏపీలో 2014లో హిందూపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా తొలిసారిగా బాలయ్య గెలిచారు.

అప్పట్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. తప్పనిసరిగా ఆయన మంత్రి అవుతారు అనుకుంటే చాన్స్ దక్కలేదు. అయితే 2017లో మాత్రం నారా లోకేష్ ఎమ్మెల్సీగా నెగ్గి మంత్రి అయిపోయారు. దీంతో బాలయ్యకు మంత్రి యోగం లేనట్లే అనుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో బాలయ్య జగన్ ప్రభంజనం తట్టుకుని మరీ గెలిచారు. ఇక 2024లో మూడవసారి గెలిచారు. మళ్ళీ మంత్రి పదవి ఆయనకు దక్కుతుందని అనుకున్నా అది జరగలేదు. మొత్తానికి బాలయ్య మనసులో ఏముందో తెలియదు కానీ అభిమానులు మాత్రం ఈ విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు. ఎందుకంటే అదే ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేలు అయిన ఎంతో మంది మంత్రి పదవిని అందుకున్నారని చెబుతారు.ఇక టీడీపీ ఆవిర్బావం నుంచి హరికృష్ణ బాలకృష్ణ ఇద్దరూ ఎంతో కష్టపడి పనిచేసారు.

హరికృష్ణ ఎన్టీఆర్ చైతన్య రధం సారధిగా తీవ్రంగా శ్రమించి ఉమ్మడి ఏపీ అంతటా తిరిగితే బాలయ్య ఎన్నికల ప్రచారం కోసం ప్రతీ సారీ డేట్స్ కేటాయించి మరీ జనంలోకి వచ్చేవారు. అలా 1987లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్ సమక్షంలోనే బాలయ్య ఇచ్చిన స్పీచ్ కి ముగ్దుడైన పెద్దాయన బాలయ్యే తన రాజకీయ వారసుడు అని ప్రకటించారు కూడా. మరో వైపు టీడీపీలో బాలయ్య చురుకుగా ఉండడం తో ఆయన సినిమాల మీద కూడా దాని ప్రభావం పడింది. ఒక సెక్షన్ ఆఫ్ ప్రజలు టీడీపీ మీద వ్యతిరేకతతో ఆయన సినిమాలను చూసేవారు కాదు.అయితే ఇంత చేసినా. .mla గా హ్యాట్రిక్ కొట్టినా ఇప్పటికీ బాలయ్య మంత్రి కాలేకపోయారు. తాజా అసెంబ్లీలో ఆయన చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తప్పు. దానిని ఎవరూ సమర్ధించరు. కానీ అదే సమయంలో వాటికి దారి తీసిన పరిణామాల మీద కూడా చర్చించాలి కదా అని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు.

కొన్ని చానెల్స్ లో బాలయ్య మీద యాంటీగా విశ్లేషణాత్మక కధనం ప్రసారం చేయడం పట్ల ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. బాలయ్య సినిమాల్లో ఉంటూ రాజకీయంగా పెద్దగా ఫోకస్ పెట్టలేదని ఆయనే కోరుకుంటే మంత్రి అయ్యేవారు కదా అని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. నందమూరి కుటుంబంలో ఆయన ఒక్కడే కదా పార్టీలో ఉన్నది అని ఎత్తి చూపిస్తున్నారు. ఈ రకమైన కధనాల ద్వారా చిచ్చు రేపి ఉన్న ఆ చిన్న నందమూరి బంధాన్ని లేకుండా చేసే ప్రయత్నమా అని బాలయ్య ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే బాలయ్య వల్లే నందమూరి ఫ్యామిలీ పాలిటిక్స్ టీడీపీలో సాగుతోంది. అసెంబ్లీ ఎపిసోడ్ చల్లారినా మళ్ళీ తట్టి లేపి టీడీపీ అనుకూల మీడియా బాలయ్య కు వ్యతిరేకంగా విశ్లేషణలు చేయడంతో ఇవి ఏ వైపు దారితీస్తాయన్న చర్చ అయితే సాగుతోంది.బాలయ్య మాత్రం ఈ విషయంలో బ్రో..i don’t care అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad