వైసిపి ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక తనయుడు బుట్టా ప్రతుల్ తన తల్లి విజయం కోసం మండల కేంద్రంలోని నందవరం గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా స్థానిక శ్రీ గురు పొంపాపతి స్వామి దేవాలయాన్ని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక నాయకులు వైసిపి మండల కన్వీనర్ శివారెడ్డి గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలోని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు గత ఐదేళ్ల వైసిపి పాలనలో జగనన్న అందించిన నవరత్నాలతో ప్రజలకు అందించిన సంక్షేమం గుర్తు చేశారు.
రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు యధావిధిగా కొనసాగడమే కాకుండా ఆరోగ్య శ్రీని 5 లక్షల నుండి 25 లక్షలకు పెంచుతూ, అమ్మ ఒడి, నేతున్న నేస్తం, చేయూత, రైతు భరోసా ఇలా ప్రతి ఒక్క పథకాన్ని ఇప్పుడు ఉన్న దానికంటే అధికంగా పెంచుతూ నవరత్నాలు 2.0 కు శ్రీకారం చుట్టారని కావున మళ్లీ జగనన్ననే సీఎం చేయాలని దీనికి ప్రజలు ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతి అందించి రానున్న ఎన్నికల్లో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక, ఎంపీ అభ్యర్థి బివై రామయ్యల ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి, వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ శివారెడ్డి గౌడ్, వైసిపి నాయకులు రమేష్ గౌడ్, యల్ల గౌడ్, సంపత్ గౌడ్, వార్డ్ మెంబర్స్ దేవల నాగన్న, రామాంజనేయులు, మిన్నళ్ల, యంకప్ప, కార్యకర్తలు వి చెన్నబసవ, చాంద్ తాత, గుడిసి మునిస్వామి, ముల్లా భాష, ఆదాం, బుజ్జిబాబు, నర్సోజి, బంగారి తదితర వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.