Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్Nandavaram: ఎస్ ఎస్ బి ఫోర్స్ కవాత్

Nandavaram: ఎస్ ఎస్ బి ఫోర్స్ కవాత్

ఎన్నికల నేపథ్యంలో..

నందవరం మండల కేంద్రంలో ఎస్ఐ తిమ్మయ్య ఆధ్వర్యంలో సహస్ర సీమ బల్ ఫోర్స్ (ఎస్ ఎస్ బి) వారు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా నందవరం ఎస్సై తిమ్మయ్య మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల పరిధిలోని నందవరం, ముగతి గ్రామ ప్రధాన రహదారి, కూడలిల నందు సహస్ర సీమ బల్ ఫోర్స్ (ఎస్ ఎస్ బి) తో కవాతు నిర్వహించామన్నారు.

- Advertisement -

ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రతి ఒక్కరు ఎన్నికల కోడ్ నియమ నిబంధనలను తప్పక అనుసరించాలన్నారు. ఎవరైనా సరే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నందవరం ఎస్సై తిమ్మయ్య, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు, ఎస్ ఎస్ బి ఫోర్స్ డి.ఎస్.పి, వారి సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News