తుంగభద్రతీరం శ్రీ రామలింగ క్షేత్రం శివనామ స్మరణం సకల పాప హరణం అంటూ… మహాశివరాత్రిని పురస్కరించుకొని నందవరం మండల పరిధిలోని గురజాల గ్రామంలో తుంగభద్ర నది తీరానికి భక్తులు పోటెత్తారు. తుంగభద్ర తీరంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో స్వయాన శ్రీ సీతారాములు వారు ప్రాణ ప్రతిష్ట చేసిన శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో కఠిన ఉపవాస దీక్ష పూని, శివనామ స్మరణ చేస్తే సకల పాపాలు హరించకపోతాయని ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం. మహాశివరాత్రి పురస్కరించుకొని ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు గురజాల గ్రామం చేరుకోవడంతో గ్రామ పురవీధులు భక్తజన సందోహంతో జన సంద్రాన్ని తలపించాయి.
మహాశివరాత్రి పురస్కరించుకొని వచ్చిన భక్తాదులు రాత్రంతా జాగరణ నిర్వహించుకునేందుకు భక్తుల కోసం రాత్రి 7-00 గంటల నుండి 9-00 గంటల వరకు కూచిపూడి, భరతనాట్య నృత్యప్రదర్శన కార్యక్రమం. రాత్రి 9-00 గంటల నుండి 12-00 శివగాణామృతం కార్యక్రమం నిర్వహించి, రాత్రి 12-00 గంటలకు లింగోద్భవ సమయమున క్షీరాభిషేకము, రుద్రాభిషేకము, రాత్రి 2-00 గంటలకు శ్రీ పర్వతవర్ధనీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవము తదనంతరం ప్రభోత్సవము నిర్వహిస్తున్నారు.