మండల పరిధిలోని కనకవీడు గ్రామంలోని టిడిపి సీనియర్ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ రఘుమూర్తి స్వామి వెంటనే మేము కూడా అంటూ గ్రామంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. రఘు మూర్తి స్వామి స్వగృహంలో గ్రామ టిడిపి నాయకులు కార్యకర్తలు ఆయన్ని కలిసి, ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బి వి జయ నాగేశ్వర్ రెడ్డి నియోజకవర్గంలోని సీనియర్ నాయకులందరికి తమ స్వగృహంలో ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించి, వారు పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. అందులో ఒకరైన కనకవీడు రఘుమూర్తి స్వామి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజుల నుండి మండలంలో పార్టీ మునుగడకు, పార్టీ అభ్యర్థుల విజయాలకు ఎనలేని సేవలు అందించారని, ఈరోజు నందవరం మండలంలో పార్టీ ప్రతిష్టతకు కారుకులైన వారిలో రఘు మూర్తి స్వామి కూడా ఒకరిని ఈరోజు ఈ విషయాన్ని మరిచిపోయి గత కొంతకాలంగా స్వార్థ ప్రయోజనాలకు పార్టీని అడ్డం పెట్టుకొని కార్యకలాపాలను కొనసాగిస్తూ ఈరోజు గ్రామంలోని టిడిపి పార్టీ శ్రేణుల మధ్య విభేదాలను సృష్టిస్తున్న వ్యక్తులకు విలువనిస్తూ పార్టీ విలువలకు, మనుగడకు అగాధాలు సృష్టిస్తున్న వ్యక్తులకు పార్టీ పగ్గాలు అందిస్తే గ్రామంలోని టిడిపి శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అందరూ పార్టీకి దూరం కావడమే కాకుండా సీనియర్ నేత రఘునాథ్ స్వామి అడుగుజాడల్లో నడవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామంటూ గ్రామంలోని టిడిపి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
కనకవీడు గ్రామంలోని టిడిపిలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్న కొందరు విశ్లేషకులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ తొలి రోజుల నుండి పార్టీతో మంచి సంబంధాలు ఉండడమే కాక అప్పటి నియోజకవర్గ నాయకులు కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి కి అత్యంత సన్నిహితంగా ఉంటూ గ్రామాభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన రఘుమూర్తి స్వామి ఈరోజు కొందరి నాయకుల ప్రవర్తన తీరుని వ్యతిరేకిస్తూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడం చూస్తుంటే గ్రామంలో తెలుగుదేశం పార్టీ మనుగడ కోల్పోయే ప్రమాదం ఉందని, గ్రామంలోని టిడిపి శ్రేణులు నాయకులు, కార్యకర్తలు యావత్ ప్రజలు సైతం రఘు మూర్తి స్వామి నాయకత్వాన్ని కోరుకుంటుందని ఈ విషయాన్ని విస్మరిస్తే రాబోవు ఎన్నికల్లో గ్రామంలోనే కాక మండలంలో కూడా తెలుగుదేశంలో రఘు మూర్తి స్వామి ప్రభావం చవిచూడాల్సి వస్తుందని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో శివన్న, భీమన్న, రామాంజినేయులు, పరమేశ్, బతకన్న, బాలయ్య, కిస్ట్ఫర్, నరసింహులు, ఆనందరాజు, దేవదాసు, లింగన్న, ఎలియ, మాదన్న, దరగయ్య, విజయ్, బీచుపల్లి, మేకల వెంకట్ రాముడు, బసిగేరి దస్తగిరి, మేకల దస్తగిరి, రమేష్, జైన్ పోగు ఆదం, భాస్కర్, మాల దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.