Saturday, April 12, 2025
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: నందికొట్కూరు ప్రచారంలో చంద్రబాబు

Nandikotkuru: నందికొట్కూరు ప్రచారంలో చంద్రబాబు

శబరి, జయసూర్య కోసం ప్రచారం

నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మహబూబ్ మొల్ల రబ్బాని, కౌన్సిలర్ మొల్ల జాకీర్ హుస్సేన్ లు కుటుంబ సభ్యులతో కలిసి నందికొట్కూరులో నిర్వహించిన ప్రజాగళం చంద్రబాబు పర్యటనలో చంద్రబాబు సమక్షంలో వైసీపీని వీడి టిడిపి పార్టీలో చేరారు.

- Advertisement -

ఈ సందర్భంగా మాజీ సీఎం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి జిల్లాల్లో బలమైన ముస్లిం మైనార్టీ నేత, నియోజవర్గంలో ప్రజాదరణ కలిగిన ముస్లిం మైనార్టీ నేత హాజీ మాబ్ సాహెబ్, ఆయన కుమారులు వైస్ చైర్మన్ మొల్ల రబ్బాని. కౌన్సిలర్ జాకీర్ జాకీర్ హుస్సేన్ లకు టిడిపి ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మండ్రా శివానందరెడ్డిల సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి, టిడిపి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం తాటిపాడు హాల్ హజీ మహేబూబ్ సాహెబ్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును టోపీ, శాలువతో ఘనంగా సన్మానించారు. ప్రజాగళం కార్యక్రమానికి విచ్చేసిన అశేష జనవాహిని మధ్య కౌన్సిలర్ మొల్ల జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య, నంద్యాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరిలను గెలిపించాలని ప్రజలను కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News