Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: ఎమ్మెల్యేను అవమానిస్తే దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదు

Nandikotkuru: ఎమ్మెల్యేను అవమానిస్తే దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదు

అడుగడుగునా దళిత ఎమ్మెల్యేను అవమానిస్తున్నారు

నందికొట్కూరు నియోజవర్గంలో ఎమ్మెల్యే దళితుడు అయినందుకు అడుగడుగునా అగ్రవర్ణాలు పెత్తనం చెలాయిస్తూ మానసిక ఆనందం పొందుతూ, అగ్రవర్ణాల కాపలా కుక్కల్లా పనిచేస్తున్న కొంతమంది దళిత వ్యక్తులను ఎమ్మెల్యే పై రెచ్చగొట్టడం ఒకవైపు అయితే.. మరోవైపు శిఖండిని అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యేను ఆర్థర్ ని ఇబ్బందుల గురిచేయడం నాయకులకు తగదని దళిత సంఘాల నాయకులు వాడాల త్యాగరాజు హెచ్చరించారు.
పట్టణంలోని సమావేశ భవన్ లో మంత్రి రోజా పర్యటనలో ప్రోటోకాల్ వివాదంలో ఎమ్మెల్యేకు జరిగిన అవమానానికి మద్దతుగా దళిత సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దళిత సంఘాల నాయకులు వైసిపి ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షుడు సగినేలా వెంకటరమణ, వాడాల త్యాగరాజు, మాల మహానాడు సీనియర్ నాయకులు రాజు, నాగేషు, అంకన్న,ఎమ్మార్పీఎస్ నాయకులు డాక్టర్ రాజు, ప్రజాబంధు పార్టీ నాయకులు నాగరాజు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు లాజరస్, జనసేన పార్టీ నాయకులు రవికుమార్ వివిధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి వాడాల త్యాగరాజు, వైసిపి ఏసి సెల్ జిల్లా అధ్యక్షుడు సగినేల వెంకటరమణలు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కృషి ఫలితంగా రాష్ట్ర రాజకీయాలలో 29 నియోజక వర్గాల్లో దళిత ప్రజలకు రిజర్వ్ స్థానాలకు కేటాయించారని, ఆ కోణంలోనే వివిధ పార్టీలు దళితులకు కేటాయించారని పేర్కొన్నారు. కానీ నియోజవర్గంలో కొంతమంది దళిత వైసిపి నాయకులు అంటూ అదేదో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పుణ్యం అంటూ అవివేకమైన మాటలు మాట్లాడుతూ మూర్ఖుల వలె వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంత్రుల పర్యటనలో ఎమ్మెల్యేగా జరిగిన అవమానాన్ని మాత్రమే, కాకుండా ఏ నియోజకవర్గంలో లేని సంస్కృతి నందికొట్కూరు నియోజకవర్గంలోని రెండు మండలాల ఎమ్మెల్యేకు, నాలుగు మండలాలు ఇన్చార్జి సిద్ధార్థ రెడ్డికి అంటూ విభజించి దళిత ప్రజాప్రతినిధిపై పెత్తనం చెలాయించడం రాజ్యాంగంలో ఎక్కడైనా రాశారా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అగ్రవర్ణాల మోచేతుల నీళ్లు తాగుతూ మొరగడం దళిత జాతికే అవమానమని …ఇకనైనా మొరగడం మానుకొని దళిత ప్రజాప్రతినిధికి జరుగుతున్న అవమానానికి బాసటగా నిలవాలి అన్నారు.. ఆనాడు జరిగిన మహాభారత యుద్ధంలో బలవంతుడైన బీష్ముని వధించుటకు శిఖండిని ఉపయోగించుకుంటే.. నేడు ఎమ్మెల్యేకు జరిగిన అవమానానికి బాసటగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు ప్రజలు అండగా నిలిస్తే.. అది చూసి ఎదురుకోలేక శిఖండిని అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యేను ఇబ్బందుల గురి చేస్తున్నారని ఇంతటి నీచ రాజకీయాలు మునుపేప్పుడు చూడలేదు అన్నారు. బేషరత్తుగా మంత్రి రోజా ఎమ్మెల్యేకు తక్షణమే క్షమాపణ చెప్పాలని దళిత సంఘ నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.

- Advertisement -

ఇంత జరుగుతున్నా సీఎం జగన్, పార్టీ పెద్దలు జోక్యం చేసుకోకపోవడంపై వారు మండిపడ్డారు. నియోజవర్గంలో దళిత ఎమ్మెల్యేకు పూర్తి స్వేచ్ఛ, మంత్రి రోజా వెంటనే క్షమాపణ చెప్పకపోతే త్వరలోనే దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ నాగన్న, వైసిపి మహిళా పట్టణ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వనజ, మాల మహానాడు పట్టణ అధ్యక్షులు నాగేష్, శివప్రసాద్, ఎస్సీ సెల్ టిడిపి నాయకులు పగడం సోమశేఖర్, కమ్యూనిస్టు పార్టీ సంఘాల నాయకులు ఆర్లప్ప, దళిత సంఘాల నాయకులు రంగస్వామి, రాజన్న, ముస్లిం మైనార్టీ నాయకులు ఇనాయాతుల్లా, షరీఫ్, దామగట్ల వైసిపి దళిత నాయకులు యేసురత్నం, సమతా సైనికదళ్ నియోజవర్గ అధ్యక్షులు సగినెల సురేష్, మహిళా సంఘాల నాయకురాలు తస్లీమా తదితర దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News