డాక్టర్ బైరెడ్డి శబరిమ్మను అభినందించారు బిజెపి నందికొట్కూరు నాయకులు. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరమ్మను బిజెపి జిల్లా పార్లమెంట్ కన్వీనర్ గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నియమించడం హర్షణీయమని నందికొట్కూరు బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ కొండే పోగు చిన్న సుంకన్న అన్నారు. బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ కొండేపోగు చిన్న సుంకన్న, బైరెడ్డి శబరిమ సైన్యం అధ్యక్షుడు నాగన్నలు మాట్లాడుతూ, బిజెపి పార్టీలో భారతీయ జనతా యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ బైరెడ్డి శబరమ్మ ను బిజెపి జిల్లా పార్లమెంట్ కన్వీనర్ గా ఎంపికైన సందర్భంగా ఆమె స్వగృహంలో కలిసి పూల బొకే ఇచ్చి అభినందించడం జరిగింది అన్నారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ బిజెపి పార్టీ ని ప్రజలకు దగ్గర చేయడంలో ఎంతో క్రమశిక్షణ కలిగిన నాయకురాలుగా పనిచేసిందని కొనియాడారు. పార్టీ కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషింస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న మనసత్వం డాక్టర్ బైరెడ్డి శబరిమ్మది అన్నారు. పార్టీ అధిష్టానం పార్టీకి బైరెడ్డి శబరమ్మ సేవలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ నంద్యాల పార్లమెంటు జిల్లా కన్వీనర్ గా నియమించడం పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. బైరెడ్డి శబరమ్మ మరిన్ని పదవులు అధిరోహించాలని నియోజవర్గ ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
Nandikotkuru: డాక్టర్ బైరెడ్డి శబరిను అభినందించిన బిజెపి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES