కేసీ కెనాల్ కు తక్షణమే నీటిని విడుదల చేసి ఆయకట్టు రైతులను ఆదుకోవాలి ఏఐకేఎంఎస్, ఐ ఎఫ్ టి యు నాయకుడు నరసింహులు, ఆశీర్వాదం, అరుణ్, గోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలో స్థానిక పటేల్ సెంటర్ నందు ఏఐకేఎంఎస్, ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో రైతులు ధర్నా రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ నాయకులు నరసింహులు మాట్లాడుతూ
శ్రీశైలం ప్రాజెక్టులో సర్వం కోల్పోయి రాయలసీమలోని అన్ని జిల్లాలకు సాగు, త్రాగు నీటిని మద్రాస్ రాష్ట్రానికి త్రాగునీటి కోసం త్యాగం చేసిన పగిడ్యాల మండలం కెసి కెనాల్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆగస్టు నెల వచ్చిన ఇప్పటివరకు కెసి కెనాల్కు నీళ్లు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈ ప్రాంతం నుండి పోతిరెడ్డిపాడు హంద్రీనీవా కాల్వ లా ద్వారా ఇతర ప్రాంతాలకు నీరు తరలించుకుని పోతున్నా ఇక్కడ రైతులు సహనంతో అన్ని ప్రాంతాల రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో ఎన్నో త్యాగాలు చేస్తున్నారని విషయాన్ని పాలకవర్గం గుర్తుంచుకోవాలి అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో ఈ ప్రాంత రైతాంగం సర్వం కోల్పోయి ఇతర ప్రాంతాలకు వెలుగులను నింపిందన్నారు. కానీ ఇక్కడ రైతులను మాత్రం ఆదుకోవడంలో ప్రభుత్వాలు మీన మేషాలు లెక్కిస్తున్నాయని విమర్శించారు. స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఇతర ప్రాంతాలకు నీటిని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారుగానీ ముచ్చుమరి లిఫ్ట్ నుండి కేసీ కెనాల్ కు నిలవడం మాత్రం మర్చిపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికే అరకొరగా ఉన్న వర్షంతో మొక్కజొన్న, మిర్చి, కంది తదితర పంటలు వేసుకున్నారని, సకాలంలో వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది అన్నారు. కెసి కెనాల్ కు నీళ్లు విడుదల లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. కేసి కెనాల్ కు నీళ్లు వదిలి రైతులను ఆదుకోవాలని వాళ్ళు విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు దివాన్ భాష, కొట్టం నాగ శేషన్న, శ్రీనివాసులు, స్వామన్న, జేమ్స్ గోపాల్, వెంకటరమణ రామకృష్ణ, నాగ లింగం, అలీ హుషన్, మాభాష, ఆజీమ్, చిన్న వలి, జల్లి వెంకట రమణ తదితర రైతులు పాల్గొన్నారు.
Nandikotkuru: కేసీ కెనాల్ కు నీరు విడుదల చేయాలని ధర్నా
కేసీ కెనాల్ ఆయకట్టు రైతాంగంను ఆదుకోవాలని డిమాండ్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES