నాలుగు సంవత్సరాల వైసిపి పాలల్లో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ సీఎం జగన్ ప్రజల ఆధార అభిమానాలను పొందుతున్న నేడు ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే “జగనన్నకు చెబుతాం ” అనే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించడం హర్షించదగిన విషయమని మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అన్నారు. పట్టణంలోనే స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ నందు సీఎం జగన్ నిర్వహించిన “జగనన్నకు చెబుతాం” కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ రాసి సుధాకర్ రెడ్డి, మరియు వైస్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు వర్చువల్ పద్ధతిలో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కార్యక్రమానంతరం మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సేవలలో భాగంగా ప్రజల సమస్యలు 1902 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి ఐ వి ఆర్ ఎస్ విధానం ద్వారా ఉన్నతాధికారులు పరిశీలించి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు.ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ హర్షపోగు ప్రశాంతి, కౌన్సిలర్స్ చిన్న రాజు, షేక్ నాయబ్, రాహుఫ్, చాంద్ బాషా, అబ్దుల్ హమీద్ మీయ్య, దే శెట్టి సుమలత, మరియు వార్డ్ ఇన్చార్జీలు ఉస్మాన్ బేగ్, వైసిపి నాయకులు రామకృష్ణ,ఆర్ట్ శ్రీనివాసులు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Nandikotkuru: మెరుగైన సేవల కోసమే ‘జగనన్నకు చెబుదాం’
సంబంధిత వార్తలు | RELATED ARTICLES