నందికొట్కూరు పట్టణంలో వైయస్సార్ జయంతిని పురస్కరించుకొని నూతనంగా నిర్మించిన డాక్టర్ వైయస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ ను ఎమ్మెల్యే తోగూర్ ఆర్థర్ ప్రారంభించారు. అనంతరం మండల వ్యవసాయ శాఖ ఏడిఏ విజయ శేఖర్, ఏవో షేక్షావలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఆర్థర్, మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ, మండలాధ్యక్షుడు మురళి కృష్ణారెడ్డి, తహసిల్దార్ రాజశేఖర్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్తర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమ ధ్యేయంగా రైతులకు న్యాయమైన విత్తనాలు, ఎరువులు అందించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో డాక్టర్ వైయస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ ను ఏర్పాటు చేశామన్నారు.
ఈ ల్యాబ్ వల్ల రైతులకు ఎంతో ఉపయోగకరమని ప్రతి రైతు ల్యాబ్ అవకాశాలను అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలని, పశుసంవర్ధక శాఖ సంబంధించిన నాణ్యత పరీక్షలు కూడా ఉచితంగా రైతులకు అందించడం జరుగుతుందని ఈ సదా అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం రైతులకు పంట బీమా లబ్ధిదారులకు 14,819 నియోజవర్గంలోని అన్ని మండలాల రైతులకు 10.37కోట్ల మెగా చెక్కు ను రైతులకు ఎమ్మెల్యే ఆర్థర్, మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ సగినేలా హుస్సేనయ్య, హరి సర్వోత్తమ రెడ్డి, కౌన్సిలర్స్ జాకీర్ హుస్సేన్, ఉండవల్లి ధర్మారెడ్డి, లాలూ ప్రసాద్, నాయబ్ , చిన్న రాజు, వైసిపి మండల కన్వీనర్ ఓంకార్,వివిధ మండలాల ఏవోలు, విజయ జ్యోతుల కుమార్, డాక్టర్ వైయస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.