సమాజంలో నిరంతరం ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని యువగళం పాదయాత్ర చేస్తున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు నందికొట్కూరు జర్నలిస్టులు విజ్ఞప్తి చేశారు. పల్లె వెలుగు రిపోర్టర్ జయరాజు, తెలుగు ప్రభ రిపోర్టర్ గోపి, ప్రజాశక్తి స్వామన్న, పల్లెవాన్ని రిపోర్టర్ ఉమర్ లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నారా లోకేష్ కు జర్నలిస్టులు విన్నవించారు. అదేవిధంగా అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్స్ ఇవ్వాలని, ప్రవేట్ పాఠశాలలో రాయితీలు కల్పించాలని, అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, వ్యవసాయ భూమి అమలు చేయడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం వహిస్తున్నాయని విలేకరుల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలని వారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం టిడిపి నేత జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమాజంలో విలేకరుల పాత్ర ఎంతో ఉందని తప్పకుండా టిడిపి పార్టీ అధికారంలోకి వస్తే తగిన విధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడతామని హామీ ఇచ్చారు.
Nandikotkuru: జర్నలిస్టుల సమస్యలపై లోకేష్ కు వినతిపత్రం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES