Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ ప్రచార యాత్ర

Nandikotkuru: ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ ప్రచార యాత్ర

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ సిపిఎం జాతీయ కమిటీలు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రచార యాత్ర కార్యక్రమములో భాగంగా స్థానిక నందికొట్కూరు పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మిడుతూరు రోడ్డు సాయిబాబా పేటలో ప్రచార యాత్ర నిర్వహించారు. ఈ ప్రచార యాత్రలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి రఘురామమూర్తి మాట్లాడుతూ బిజెపి పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టి ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని పేర్కొన్నారు .ముఖ్యంగా నిత్యవసర వస్తువుల ధరలు బాగా పెరిగినవి అని పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు అధికంగా పెరగడం వల్ల సామాన్య ప్రజల జీవన అగర్మికోచరకంగా తయారైందాన్ని ఆరోపించారు . పేద ప్రజలకు అందించే గ్యాస్ 400 రూపాయలు ఉన్న ధర నేడు 1200 రూపాయలకు చేరడం ప్రభుత్వ అసమర్థతే కారణమని విమర్శించారు. అధికారంలో ఉన్న కేంద్రము ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు ధారాధతం చేయడం వల్ల దేశ సార్వభౌమాధికారం దెబ్బతింటుందని, ఇలాంటి ధోరణి కేంద్ర ప్రభుత్వ విడనాడాలని లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
పట్టణంలోని మిడ్తూర్ రోడ్డులో గల లైబ్రరీ 12 సంవత్సరాల నుండి మరమ్మత్తులకు నోచుకోలేదని వారన్నారు. ప్రభుత్వ లైబ్రరీ స్థలాన్ని ఇతర వ్యక్తులు కబ్జా చేసినప్పటికీ వారి పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారన్నారు. పట్టణ ప్రజలు మున్సిపాలిటీకి ఇంటి పన్ను నీటి పన్ను చెత్త పన్ను వివిధ పన్నుల ద్వారా లక్షలాది రూపాయల్లో ఆదాయం ఉన్నప్పటికీ శిథిలావస్థకు చేరుకున్న గ్రంథాలయాన్ని నూతన భవన నిర్మాణం చేపట్టకపోవడం బాధాకరం అని వారన్నారు.పన్నుల ద్వారా మున్సిపాలిటీ వచ్చే ఆదాయంను నూటికి నాలుగు శాతం లైబ్రరీకి ఖర్చు పెట్టాలని నిబంధనలు ఉన్నప్పటికీ పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ ఇది తగదని హెచ్చరించారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా గ్రంథాలయాన్ని నూతన భవన నిర్మాణం నిర్మించాలని వారన్నారు.
గ్రంథాలయ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనీ లైబ్రరీ స్థలాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ నాయకులు రాముడు ఉస్మాన్ భాష, ఏఐటీయూసీ పట్టణ నాయకులు బోయ. శ్రీనివాసులు, ముత్తు జావలి ,హుస్సేన్, ఆటో చంద్ర, అస్లాం భాష, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ఎం శ్రీనివాసులు, మహానంది , వీరేంద్ర దినేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News