రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ వారి హృదయాలలో ‘జగనన్ననే మా భవిష్యత్’ అనే ఆకాంక్ష కలిగేలా పరిపాలన కొనసాగిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే తోగూర్ ఆర్థర్ పేర్కొన్నారు. నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో కోట వీధిలో ఎమ్మెల్యే తోగూర్ అర్థర్ జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా కోటవీధిలో 15 గృహాలను సందర్శించి వారి అభిప్రాయాలను సేకరించి, కుటుంబ సభ్యుల అనుమతి పొందిన తర్వాతే జగనన్నే మా భవిష్యత్ అనే స్టిక్కర్లను గృహాలకు, ఫోన్లకు అతికించారు.
అనంతరం ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ సీఎం జగనన్న పాలనలో ప్రజలు అనేక ప్రయోజనాలు పొందుతున్నారని ప్రతి గడపలో సీఎం జగన్ పై అమితమైన ప్రేమను ప్రజలు చూపుతున్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన పై ప్రజల ఆదరణ తగ్గలేదని స్పష్టం చేశారు. నవరత్నాల పథకాల పేరుతో ప్రజలకు మరింత సేవలు చేయడానికి సచివాలయ వ్యవస్థలు తీసుకురావడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో అర్బన్ సీఐ విజయభాస్కర్ , 18 వార్డ్ కౌన్సిలర్ ఉండవల్లి ధర్మారెడ్డి, కౌన్సిలర్ మొల్ల జాకీర్ హుస్సేన్ , దిశెట్టి సుమలత, నందికొట్కూరు సింగిల్ విండో చైర్మన్ సగినేలా హుస్సేనయ్య, బ్రహ్మం కొట్కో సింగిల్ విండో చైర్మన్ మద్దూరి హరి సర్వోత్తమ రెడ్డి, పట్టణ మహిళా కార్యదర్శి డాక్టర్ వనజ, ఎస్సీ సెల్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ, దామ గట్ల సర్పంచ్ రత్నం, కొణిదెల సర్పంచ్ నవీన్, వైసిపి నాయకులు తమ్మడపల్లి విక్టర్, రిటైర్డ్ పోలీస్ అధికారి పేరుమాల జాన్, ఆర్ట్ శీను, ముజిబ్, శాతనకోట వెంకటేశ్వర్లు, భాస్కర్ రెడ్డి, శంకరయ్య, మహేష్, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొన్నారు.