Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: గిత్త జయసూర్య గెలుపే ప్రజల గెలుపు కావాలి

Nandikotkuru: గిత్త జయసూర్య గెలుపే ప్రజల గెలుపు కావాలి

స్థానికుని గెలిపించి అభివృద్ధికి తోడ్పడండి

రాష్ట్ర భవిష్యత్తు.. నందికొట్కూరు నియోజవర్గ ప్రజల భవిష్యత్తు టిడిపి పార్టీతోనే సాధ్యమని, లోకల్ నాన్ లోకల్ కు జరుగుతున్న ఎన్నికల పోరు అని స్థానికుడైన టిడిపి అభ్యర్థి గిత్త జయసూర్యను ప్రజలు గెలిపించుకొని అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, జయ సూర్య గెలుపు ప్రజల గెలుపు కావాలని నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మండ్రా శివానందరెడ్డి అన్నారు. నందికొట్కూరు పట్టణంలోని ఏబీఎం పాలెంలో పట్టణ, ఏబీఎం పాలెం టిడిపి నాయకుల నిమ్మకాయల మోహన్,కళాఖర్, బొల్లెద్దుల రాజన్న, నిమ్మకాయల రాజు ఆధ్వర్యంలో టిడిపి శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయ సూర్య, నంద్యాల టిడిపి పార్లమెంట్ ఇంచార్జ్ మండ్రా శివానందరెడ్డి లు హాజరయ్యా రు. ఈ సందర్భంగా వారికి ఏబీఎం పాలెం టిడిపి నాయకులు నిమ్మకాయల మోహన్, కళాకర్, బొల్లెద్దుల రాజన్న, నిమ్మకాయల ఆధ్వర్యంలో ఏబిఎం పాలెం ప్రజలు భారీగా స్వాగతం పలికారు. అనంతరం ఏబీఎం పాలెంనకు ర్యాలీగా బయలుదేరి నేతలు గిత్త జయసూర్య, మండ్రా శివానందరెడ్డిలు ప్రజలకు అభివాదం చేస్తూ నమస్కరిస్తూ ముందుకు సాగారు.

- Advertisement -

కూడలిలో ప్రజలను ఉద్దేశించి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య మాట్లాడుతూ స్థానికుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల్లో ఒకడిగా నియోజవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సేవ చేయడానికి టిడిపి పార్టీ నాయకులు మండ్రా శివానందరెడ్డి ఆశీస్సులతో టిడిపి అభ్యర్థిగా అవకాశం దక్కిందన్నారు. నియోజవర్గానికి ఎక్కడి నుంచో సూట్ కేసులతో డబ్బులు తీసుకొచ్చి, ఎమ్మెల్యే సీటును కొనుగోలు చేసి ప్రజలను వంచన చేయడానికి వైసిపి పార్టీ స్థానికేతర్లకు అవకాశం కల్పించిందన్నారు. ప్రజల సంక్షేమం కోసం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశ పెట్టారని, చంద్రబాబు పాలన రాష్ట్రానికి ఎంతో అవసరమని, టిడిపి పార్టీని ఆదరించాలని ఆయన అభ్యర్థించారు. స్థానికేతర్లకు అవకాశం కల్పిస్తే నియోజవర్గాన్ని దోచుకుపోతారే తప్ప అభివృద్ధికి ఏ మాత్రం పాటుపడరని, అలాంటి వారికి బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, మోహన్ రెడ్డి,నాయకులు ఎస్ఎండి జమీల్, మూర్తు జావలి,లాయర్ జాకీర్ హుస్సేన్, షకీల్ అహ్మద్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు విజ్జి మాదిగ, ప్రేమ రాజు మాదిగ, శేషన్న, రమేష్, పగిడ్యా ల మండల నాయకులు పలుచాని మహేశ్వర రెడ్డి, పగడం సోమశేఖర్, టౌన్ నాయకులు అయ్యన్న,మాజీ కౌన్సిలర్ సురేంద్ర,కృష్ణారెడ్డి,నాగలూటి బాబు సాహెబ్,కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News