టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుని వైసిపి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి అక్రమ అరెస్టు చేయడం తగదని వచ్చే సార్వత్రిక ఎన్నికల ప్రజాక్షేత్రంలో నియంత వైసిపి పాలకుడు సీఎం జగన్మోహన్ రెడ్డికి తగిన మూల్యం గుణపాఠం తప్పదని టిడిపి నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి హెచ్చరించారు. పట్టణంలో స్థానిక పటేల్ సెంటర్ నందు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ టిడిపి నేత మాండ్ర శివానందరెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోతో ధర్నా కార్యక్రమం చేపట్టారు. దీంతో పట్టణంలోని వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే టిడిపి నాయకులు పట్టణ బంద్ చేపట్టడంలోని పట్టణంలో వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. నిరసన కార్యక్రమంలో టిడిపి నేత మండ్రా శివ నంద రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నియంత పాలన కొనసాగిస్తున్నాడని, స్కిల్ డెవలప్మెంట్ లో 550 కోట్లు అవినీతికి పాల్పడ్డారంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తమ అధినేత చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం నియంత పాలనకు నిదర్శనమని ఇది తగదని వారు హెచ్చరించారు. కక్షపూరితమైన ధోరణితో తమ నేతపై కేసులు సిగ్గుచేటని విమర్శించారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రి మాజీ సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా చంద్రబాబు పై ఎన్నో ఆరోపణలు చేసిన ఏవి నిరూపించలేకపోయారన్న విషయం సీఎం జగన్ గుర్తుంచుకోవాలన్నారు. తమ అధినేత చంద్రబాబు మచ్చలేని నాయకుడని ప్రజల కోసం నిస్వార్ధంగా వైసీపీ ప్రభుత్వ పాలన తీరుపై నేడు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తీరును ఎండగడుతుంటే అది ఓర్వలేని వైసీపీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని ఆరోపించారు. కుట్రలకు కుతంత్రాలకు తమ అధినేత చంద్రబాబు నాయుడు బెదిరిదే లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టిడిపి చేపట్టిన వివిధ కార్యక్రమాలకు ప్రజల నుంచి వచ్చే స్పందన చూసి ఓర్వలేకే వైసీపీ ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందని వారికిప్రజల చేత తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తమ అధినేత చంద్రబాబు నాయుడిని తక్షణమే విడుదల చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. టిడిపి చేపట్టిన నిరసన బంద్ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రూరల్ సీఐ విజయ భాస్కర్ ఆదేశాల మేరకు వివిధ మండలాల ఎస్ఐలు నాగార్జున, ఓబులేసు, వెంకటసుబ్బయ్య లు తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాజీ మండలాధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి, మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయసూర్య, ముస్లిం మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్, లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు లాయర్ జాకీర్ హుస్సేన్, ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు ముర్తుజావలి,పట్టణ టిడిపి అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, బిసి సెల్ అధ్యక్షులు పాణ్యం వేణు, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు జయాకర్,ఎస్సీ సెల్ పట్టణ ప్రధాన కార్యదర్శి బుల్లెద్దుల రాజన్న, వార్డ్ ఇన్చార్జి కళాకర్, ప్రవీణ్ రగడ మరియు వివిధ మండలాల నాయకులు గ్రామాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.