Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్BJYM Nandyala: అన్నా ఓ జగనన్నా ఎక్కడన్నా మా జాబ్ లు..

BJYM Nandyala: అన్నా ఓ జగనన్నా ఎక్కడన్నా మా జాబ్ లు..

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకుంటున్నారని, నాలుగేళ్లుగా ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీచేయకుండా మోసం చేస్తున్నారని, మెగా జాబ్ క్యాలెండర్ నెల రోజుల్లో ప్రకటించి ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేపట్టకుంటే బిజెవైఎం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తామని బిజెవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్   బైరెడ్డి శబరి హెచ్చరించారు.  నంద్యాల జిల్లా కలెక్టరేట్ ముందు “అన్నా ఓ జగనన్నా ఎక్కడన్నా మా జాబ్ లు” అంటూ బిజెవైఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 2.35 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ లెక్కలే తెలుపుతున్నాయని అన్నారు. ప్రతి జనవరిలో  జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అయ్యి నాలుగేళ్లు గడుస్తున్నా హామీ నెరవేర్చలేదని, వాలంటీర్ జాబ్ తో నెలకు ఐదు వేల రూపాయలతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని  విమర్శించారు.మెగా డిఎస్సీ ఏమైందని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్న జగన్ హామీ ఎందుకు అమలు చేయలేదని ఆమె నిలదిశారు. మెగా జాబ్ మేళాలతో  నిరుద్యోగ యువతను జగన్ ప్రభుత్వం మభ్యపెడుతోందని విమర్శించారు. ఉన్నత చదువులు చదివి అటు ఇళ్ల వద్ద పనులు చేసుకోలేక ఇటు ఉద్యోగం లేక నిరుద్యోగులు మానసికంగా కుంగిపోతున్నారని, ప్రభుత్వం మద్యం షాపులు, చికెన్, మటన్ దుకాణాలలో ఉద్యోగం చేయించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నిరుద్యోగ యువత ఆవేశం, ఆగ్రహానికి గురి అవుతున్నారని, వచ్చే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వంను కుప్పకూల్చేందుకు సిద్ధంగా ఉన్నారని అందుకు ఉదాహరణ ఇటీవల రాష్ట్రంలో జరిగిన పట్టభద్రుల ఎన్నికలే నిదర్శనం అని బైరెడ్డి శబరి అన్నారు.

- Advertisement -

ఈ నిరసన కార్యక్రమంలో బిజెవైఎం నంద్యాల జిల్లా అధ్యక్షులు చైతన్య కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరావు, కార్యదర్సులు మహేష్, మనోజ్, చంద్రపాల్ నాయుడు, రాష్ట్ర సభ్యులు వెంకట్ తో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బిజెవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు డిమాండ్ల తో కూడిన వినతి పత్రం అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News