నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదిదారుల నుంచి నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి 115 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండీ విచ్చేసిన ఫిర్యాదిదారుల సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు .చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని ,స్పందన ఫిర్యాదులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని ,స్పందన పిర్యదుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరించరాదని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఫిర్యాదులలో సివిల్ తగాదాలు , కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు ,ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేయడం మొదలగు ఫిర్యాదులు ఉన్నాయి.
ఫిర్యాదులలో కొన్ని 2019 న ఉద్యోగాలు ఇప్పిస్తామని కర్నూలు జిల్లా వెల్దుర్థికి చెందిన ప్రశాంత్ బాబు మరియు అతని కొడుకు సంజీవయ్య కొండ ఇద్దరు కలిసి నంద్యాల జిల్లా డోన్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి వద్ద నుండి తొమ్మిది లక్షలు తీసుకొని ఉద్యోగం ఇప్పించకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేస్తున్నాడని నాకు న్యాయం న్యాయం చేయండి అని ఇదేవిధంగా చిట్టెమ్మ, మధు ,సుంకనలను కూడా మోసం చేశారని జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్నాను. నాకు ఒక వ్యక్తి నాకు తెలియని నెంబర్ నుండి ఫోన్ చేసి నీపై విద్యార్థులు కంప్లైంట్ చేశారు.మీరు 12,000 పంపితే నేను మీ పైన ఏ విధమైన చర్య తీసుకోకుండా చూస్తానని మోసం చేసి నావద్ద నుండి డబ్బులు తీసుకున్నాడని ఇలాగ చాలా మందిని మోసం చేశాడని దివాకర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.నంద్యాల జిల్లా ప్రజలకు తెలియజేయడం ఏమనగా పోలీస్ స్పందన ఫిర్యాదుల గురించి సమాచారం తెలుసుకోవడానికి ,మరియు సెంట్రల్ కంప్లైంట్ సెల్ గురించిన సమాచారం తెలుసుకొనుటకు శాంతిభద్రతలకు సంబంధించిన విషయాల కొరకు నంద్యాల జిల్లా ఎస్పీ గారిని సంప్రదించాలి లేదా మాట్లాడాలి అనుకున్న ఫిర్యాదుదారులు 9154987020 నంబర్ కు ఫోన్ చేసి గాని లేదా మీ యొక్క సమస్యలకు సంబంధించిన ధ్రువపత్రమును వాట్సాప్ ద్వారా గాని తెలియజేయవచ్చును.దూర ప్రాంతాలనుండి వచ్చువారు వ్యయప్రయాసలతో జిల్లా పోలీసు కార్యాలయానికి రాకుండా ఈ సదుపాయం ఉపయోగించుకోవాలని మీ యొక్క సమస్యలకు సంబంధించిన ధ్రువపత్రమును వాట్సాప్ ద్వారా గాని తెలియజేయాలని వాటిపై ప్రత్యక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ గారు తెలియజేశారు.నంద్యాల జిల్లా ఎస్పీ స్పందకు వచ్చిన ఫిర్యాదిదారులకు ఓంకారం ధేవస్థానం వారిచే భోజన వసతి ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ జి.వెంకటరాముడు,స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ జె.వి సంతోష్,సీఐదస్తగిరి బాబు ,సీఐ సూర్యమౌళి పాల్గొన్నారు.