Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: 16,17 తేదీల్లో లోకేష్ పాదయాత్ర

Nandyala: 16,17 తేదీల్లో లోకేష్ పాదయాత్ర

రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకోసం నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నంద్యాలలో ఈ నెల 16, 17 ఉంటుందని తెలుగుదేశం యువనేత భూమా జగత్ విఖ్యాత రెడ్డి పేర్కొన్నారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యువగళం పాదయాత్ర విశేషాలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకోసం కుటుంబాన్ని వదిలి మన కోసం యువగళం అనే పేరుతో పాదయాత్ర చేపట్టారని అన్నారు. నేటితో 97 రోజులు పూర్తి చేసుకొని 1200 కిలో మీటర్ల మైలురాయి చేరుకున్నారని అన్నారు.నంద్యాలలో ఈ నెల 16,17 తేదీల్లో కొత్తపల్లి మీదుగా చేరువుకట్ట నుంచి నూనెపల్లి నుంచి బనగానపల్లె వైపు వెళతారని అన్నారు.నంద్యాలలో బహిరంగ సభ సనుమతులు వచ్చిన తర్వాత వెల్లడిస్తామని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ బాగుపడాలని కుటుంబాన్ని వదిలి 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టడంతో అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు,సమస్యలకు హామీ ఇవ్వడానికి వస్తున్నారని పేర్కొన్నారు.ప్రజలు ప్రతి ఊర్లో ముఖ్యంగా మహిళలు,విద్యార్థులు,రైతులు పెద్ద సంఖ్యలో ఘనస్వాగతం పలుకుతున్నారని అన్నారు.నంద్యాలలో నాయకులు కలిసికట్టుగా లేరు అన్న పాత్రికేయుల ప్రశ్నకు సమాధానం ఇస్తూ పార్టీలో ఎవరైనా టికెట్టు ఆశించవచ్చు,అధిష్టానం టికెట్టు ఎవరికిచ్చినా కలిసికట్టుగా తెలుగుదేశం విజయానికి కృషి చేస్తామని అన్నారు.నాయకులు అందరూ కలిసి నారా లోకేష్ కు ఘనంగా స్వాగతం పలుకుతామని అన్నారు.తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమావేశాలకు ఇసుకవేస్తే రాలనంతగా జనం వస్తుండడంతో వైసిపి ప్రభుత్వం ఓర్వలేక జీఓ నెంబర్ 1 ని ఏర్పాటుచేయడంతో సభలు,ర్యాలీలు,బహిరంగ సభలకు ఇబ్బందులు కల్గిస్తుండడంతో పార్టీ కోర్టును ఆశ్రయించిందని అన్నారు.హై కోర్ట్ సంచనలు తీర్పు ఇచ్చింది,జీఓ నెంబర్ 1 ని రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడంతో ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ధర్నాలు,ర్యాలీలు చేసుకున్నారని ,ప్రతిపక్షాలను అనగదొక్కడనికే ఈ జీఓ తెచ్చారని అన్నారు.వైసిపి ప్రభుత్వం అరాచకాలు చేసి హై కోర్టులో తిట్లు,తినిపించుకోవడం వారికి అలవాటు గా మారిందని ఎద్దేవా చేశారు. వైసిపి ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు,నిత్యావసర వస్తువులు రోజు,రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయని,పేదలకు 100 ఇస్తూ 1000 దోచుకోవడమేనని ఆరోపించారు.యువగళం పాదయాత్రకు యువకులు, మహిళలు, ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు ఏ.వి.ఆర్.ప్రసాద్,శివ శంకర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News