నంద్యాల పట్టణంలోని 5వ వార్డు నడిగడ్డ ప్రాంతానికి చెందిన 50 కుటుంబాలకు చెందిన యువత స్థానిక కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్ ఆద్వర్యంలో ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి సమక్షంలో టీడీపీని వీడి వైసీపీలోకి చేరారు. వీరందరిని ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించి పార్టీకండువాలు కప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న పారదర్శక పాలన, నంద్యాల ఓల్డ్ టౌన్ ప్రాంతంలో శరవేగంగా మునుపెన్నడు లేనివిధంగా జరిగిన అభివృద్ధి, సంక్షేమ లబ్ధికి ఆకర్షితులైన యువత వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీలోకి రావడం అభినందనీయం అన్నారు. ఓల్డ్ టౌన్ ప్రాంతంలో 2 కోట్లకు పైగా నిధులను వెచ్చించి మెయిన్ రోడ్డును ఏర్పాటు చేశామన్నారు.
నబి నగర్ వాసుల కోరిక మేరకు ఈ ప్రాంతానికి నూతన సొబగులు దిద్దుతూ నబినగర్ ఆర్చిని ఏర్పాటు చేశామన్నారు. అలాగే ప్రతి వీధిలో సీసీ రోడ్డు, డ్రైనేజ్లు, కల్వర్టులు, స్వంత నిధులతో శిల్పా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు, అభివృద్ధి మాత్రమే కాకుండా సంక్షేమ పథకాలను అందించామన్నారు. గడప గడపలో ప్రజల వద్దకు వెళ్లినపుడు సమస్యలను తెలియజేశామన్నారు. వాటిని పరిష్కరించామని, మరిన్ని సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో యువత కీలక పాత్రను పోషించాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, మరోసారి నంద్యాలలో వైఎస్సార్ కాంగ్రేస్ జెండా రెపరెపలాడాలని, తనను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారీటీతో గెలిపించాలని, మీ బిడ్డగా మీ అందరి ఆశీర్వాదాలు తనపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇమామ్ బాష, సమీర్ బాష, సోహెల్, ఫిరోజాఖాన్, హుసేన్సీ, మాబాష, మౌలానా, మన్సూరాఖాన్, మహ్మమ్మద్, అలి పాల్గొన్నారు.