నంద్యాల పట్టణంలో అల్పసంఖ్యాక, ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాలకు శిల్పా కుటుంబం అండగా నిలుస్తుందని, ఎటువంటి అవసరాలు వచ్చినా మీకు ఎల్లవేలలా సహకారం అందిస్తామని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఎస్బీఐ కాలనీకి చెందిన 50 రజక సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు రాష్ట్ర బెస్త సంక్షేమ సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్ ఆద్వర్యంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సమక్ష్యంలో టీడీపీని వీడి వైసీపీలోకి చేరారు. వీరందరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈనెల 28వ తేది నంద్యాల పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారికి శిల్పా కుటుంబం ఎల్లప్పుడు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈనెల నంద్యాలలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయాలని కోరారు. భవిషత్తులో జరుగనున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషిచేయాలని కోరారు. పార్టీలో చేరిన వారు వెంకటరమణ, ఎల్లయ్య, వెంకటరాముడు, సుబ్బరాయుడు, రాముడు, నాగరాజు, వెంకటేశ్వర్లు,
రంగన్న, శ్రీనివాసులు, వెంకటరమణ, చిట్టిబాబు, దిబ్బన్న, వీరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.