జగనన్న ధైర్యానికి, నాయకత్వానికి, పారదర్శక పాలనకు ఆకర్షితులై టీడీపీ నుండి వైఎస్సార్సీపీ వైపు అధిక సంఖ్యలో ప్రజలు రావడం సంతోషంగా ఉందని నంద్యాల మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల వైసీపీలోకి టీడీపీ నుండి వలసలు పెద్ద ఎత్తున సాగాయి. పట్టణంలోని 35 వార్డు నుండి 70 కుటుంబాలు వార్డు కౌన్సిలర్ బషీద్, పైలట్, పెద్ద మౌలాలి, అధిల్, నాయకత్వంలో ఫరుక్, సోహెల్, ఫిర్రు, ఇమ్రాన్ అమ్ములు, నయాజ్ , శాదిక్ , వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పార్టీ కండువాలను కప్పి హృదయపూర్వకంగా ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ యువత వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీలోకి వెల్లువలా తరలి వస్తుంటే రానున్న ఎన్నికల్లో జగనన్న ప్రభంజనం ముందే తెలుస్తుందన్నారు. ఎటువంటి అజెండా లేకుండా కేవలం వారి వ్యక్తిగత అజెండాలతో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికల్లో వస్తున్నాయని, వారికి ప్రజల గురించిన అజెండా కంటే జగనన్నను ఓడించాలన్న కక్షపూరితమై అజెండాయే ముఖ్యంగా ఉందన్నారు. వారు ప్రజలకు భవిషత్తులో ఏమి చేస్తారో చెప్పలని, కేవలం ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
నంద్యాలలో శిల్పా కుటుంబాన్ని ఓడించేందుకు అనేక శక్తులు ఏకం అవుతున్నాయని, వైఎస్సార్సీపీలో ఉన్న ప్రతి ఒక్కరు సమానమేనని ఎటువంటి తేడాలు, తారతమ్యాలు లేవన్నారు. తాను కేవలం మీ అందరి తరుపున ప్రతినిధిగా శిల్పా రవిరెడ్డి మీ గళం వినిపించే వాడు అన్నారు. శిల్పా కుటుంబం, శిల్పా కార్యాలయం, ఇళ్లు ఎప్పుడూ మీకు స్వాగతం పలుకుతాయని, ఎటువంటి సమస్య ఉన్నా నిర్భయంగా రావచ్చని తెలిపారు. మనమందరం ఒకే కుటుంబంగా ఉంటూ రానున్న ఎన్నికల్లో కృషి చేయాలని, కేవలం 45 రోజులు కష్టపడితే వచ్చే 5 సంవత్సరాలు మీకు సేవచేసేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపారు.