Wednesday, July 3, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: కేసుకొక రేటు!

Nandyala: కేసుకొక రేటు!

స్టేషనుకు వస్తున్న కేసులను బట్టి ఓ రేటు కేటాయిస్తున్న సీఐ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నారు. అయితే కొన్ని వ్యవస్థలోని కొందరి అవినీతి అధికారుల వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వస్తోంది. అందులో భాగంగానే నంద్యాల జిల్లా కేంద్రంలో.. పనిచేసే ఓ పోలీసు ఉన్నతాధికారి చేస్తున్న అక్రమాలు, అవినీతి దందాలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్నప్పటికీ ఓ సిఐ క్యాడర్ కలిగిన ఆ పోలీసు అధికారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైనట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఇదంతా బహిరంగ రహస్యమే..

ఆ సీఐ చేస్తున్న అక్రమాలు అవినీతి దందాలు నంద్యాల జిల్లా కేంద్రంలో పోలీసు వ్యవస్థలో పనిచేసే చిన్న అధికారులను అడిగినా బహిరంగంగానే చెబుతుండడం విశేషం. కానీ ఆ అధికారి అక్రమాలు, దందాల విషయం నంద్యాల జిల్లా కేంద్రంలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నప్పటికీ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు అధికారి మౌనంగా ఉండడం అనేక పరిణామాలకు దారి తీస్తోంది. ఆ సిఐ నిత్యం ఇసుక, ఇటుక, మట్కా, పేకాట రాయుళ్లకు అండగా ఉండి లక్షల్లో కూడా పెట్టినట్టు సమాచారం. అటువంటి అవినీతి సీఐపై తెలుగుప్రభ ప్రత్యేక కథనం..

ఎవరు ఈ సీఐ.?

నంద్యాల జిల్లా కేంద్రం ఏర్పడినప్పుడు జిల్లా కేంద్రంలోని ఓ స్టేషన్ కి వచ్చిన ఓ సిఐ. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఎంతో మంది సీఐలు వచ్చిన బదిలీలు చాలా జరిగాయి. అయినప్పటికీ ఆ సీఐ నంద్యాల జిల్లా కేంద్రాన్ని దాటకుండా జిల్లా కేంద్రంలోని ఉంటున్నారంటే అతనికున్న పలుకుబడి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇదే అదునుగా భావించి ఆ సిఐ చేస్తున్న అక్రమాలు, అవినీతి దందాలు చాలానే ఉన్నాయి. ఆ సిఐ పెట్టిన మానసిక ఇబ్బందులు వల్ల అదే పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా హల్చల్ అయినప్పటికీ ఆ సీఐపై చర్యలు శూన్యం కావడంతో జిల్లా అధికారులపై అప్పట్లో ఆరోపణలు హల్చల్ అయ్యాయి.

స్టేషన్లో అడుగుపెడితే ఫిక్స్డ్ రేట్

ఆ స్టేషన్ పరిధిలోని సామాన్య ప్రజలు సైతం ఆ స్టేషన్ కి వెళ్లాలంటే జంకుతున్నారు. ఆ స్టేషన్ పక్క బార్డర్లో ఉన్న వేరే స్టేషన్ కు వెళుతున్నారు అంటే.. ఈ అధికారిపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చును. ఆ స్టేషన్ కి వెళ్తే సీఐతో పాటు అతనికి సంబంధించిన రౌడీ షీటర్లు, పిడి యాక్ట్ కలిగిన రౌడీలు వెంటనే అక్కడికి వచ్చి మీ సమస్య ఏంటో చెప్పండి మేం పరిష్కరిస్తామంటూ చెప్పడంతో స్థానిక ప్రజలు సైతం ఆ స్టేషన్ కు వెళ్లాలంటే బెంబేలెత్తుతున్నారు. కేసులకు సంబంధించిన రేట్లను ఉన్నతాధికారి అండతో మీ సమస్యను పరిష్కరిస్తామంటూ ముందే రేటు ఫిక్స్ చేయడంతో ప్రజలు భయపడుతున్నారు. అందులో భాగంగానే పట్టణంలోని నూనెపల్లికి చెందిన యాదవ సంఘాలకు సంబంధించిన ఇద్దరి అన్నదమ్ముల స్థలాల సమస్యకు ఆ పోలీసు ఉన్నతాధికారి ముడుపులు తీసుకుని సమస్యను పరిష్కరిష్కరించలేదంటూ.. వారు వారి బంధువులతో చాలాసార్లు వాపోయినట్టు సమాచారం.

ఆ పోలీస్ ఉన్నాతాధికారిపై ప్రస్తుతం ఉన్న ఆరోపణలలో కొన్ని..

— ఆ సీఐ పెట్టిన మానసిక ఇబ్బందులు వల్లనే ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన సంఘటన జిల్లా పోలీసు వ్యవస్థకు తెలుసు.

— నూనెపల్లెకు వచ్చే ప్రతి ఇసుక లారీ యజమాని ప్రతినెలా ఆ సీఐ కి రూ.5000:/ రూపాయలు ఇచ్చుకోవాల్సిందే..

— నూనెపల్లెకు ప్రతిరోజు వచ్చే ఇసుక లారీలు 60 నుంచి 70

— ఆ లారీల నుంచి సీఐ కి వచ్చే నెల ఆదాయం అక్షరాల మూడు లక్షల పైన..

— ఆ స్టేషన్ పరిధిలో ఉన్న ఇటుకల బట్టీల నుంచి ప్రతినెల ముడుపులు చెల్లించాల్సిందే..

— ధర్మశాల, రైల్వే స్టేషన్, నూనపల్లె, చర్చి సెంటర్లలో ఉన్న మట్కా బీటర్లు, పేకాట రాయళ్లు, గంజాయి నిర్వాహకులు..వారం వారం మామూలు ఇచ్చిపిచ్చుకోవాల్సిందే..

ఆ ఇద్దరి కనీసన్నల్లోనే దందా…

ఆ స్టేషన్ లో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి వద్ద ఉన్న ఓ హోంగార్డు (డ్రైవర్ ), సీనియర్ కానిస్టేబుల్ లు ఈ దందాలు వసూలు చేసి ఆ అధికారికి అందజేస్తున్నట్లు సమాచారం. ఆ సీఐ పేరు చెప్పి వీరు ఇరువురు భారీ స్థాయిలో దందాలు చేసినట్టు సమాచారం. ఆ సీఐకి భారీ స్థాయిలో నెల మామూలు అందించడంతో పాటు మీకు మేము అండగా ఉంటామని చెప్పడంతోనే ఆ సీఐ వారిద్దరినీ నమ్మిన బంటుగా భావిస్తున్నట్లు అదే పోలీస్ స్టేషన్లో పనిచేసే సిబ్బంది చెబుతుండటం విశేషం. దీంతో ఈ పోలీస్ స్టేషన్ కు ఎస్సైగా రావడానికి భయపడుతున్నారంటే.. ఈ స్టేషన్లో వారి దందా ఏ విధంగా నడుస్తుందో అర్థం చేసుకోవాలి.

ఇటువంటి అధికారులపై రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నప్పటికీ కొందరు ఉన్నతాధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావట్లేదు. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుందని కొందరు పోలీసు సిబ్బంది ప్రజా సంఘాల నాయకులు చెబుతుండటం విశేషం. ఏది ఏమైనప్పటికీ అవినీతికి పాలపడిన అధికారిపై విచారించి చర్యలు తీసుకుంటారో లేదో.. వేచి చూడాల్సిన పరిస్థితి నంద్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ వ్యవస్థలో నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News