Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: జగనన్న లేఅవుట్లలో అన్ని వసతులు కల్పించాలి

Nandyala: జగనన్న లేఅవుట్లలో అన్ని వసతులు కల్పించాలి

జగనన్న లేఅవుట్ లలో ఇళ్ల నిర్మాణాల పురోగతి పెంచడంతోపాటు నీటి సరఫరా, డ్రైనేజీ, అంతర్గత రహదారులు తదితర మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇళ్ల నిర్మాణాల పురోగతి, గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, ఆయుష్మాన్ భారత్ సర్వే ప్రగతి, పారిశుధ్యం, ఉపాధి పనులు తదితర అంశాలపై అన్ని మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్, ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ జగనన్న లేఅవుట్ లలో ఇళ్ల నిర్మాణాలను లక్ష్యం మేరకు పూర్తి చేయడంతో పాటు అన్ని మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని లేఔట్ లలో నీటి సరఫరా, డ్రైనేజీ, అంతర్గత రహదారులు వుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న కాలనీల్లో అడిగిన వాళ్లకు వెంటనే విద్యుత్ కనెక్షన్ మీటర్ ఇవ్వాలని ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు.గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా పెండింగ్ లో ఉన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, ఆయుష్మాన్ భారత్ సర్వే ప్రగతి వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 0-5 సంవత్సరాల పిల్లల ఆధార్ నమోదు, పుట్టిన తేదీ ధ్రువీకరణ, 6-19 సంవత్సరాల గ్రాస్ ఎన్రోల్మెంట్ డేటా, గర్భిణీ స్త్రీల హెల్త్ చెకప్, రక్తహీనత తదితర అంశాలకు చెందిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సర్వే త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అలాగే ఆయుష్మాన్ భారత్ సర్వే 72 శాతం పూర్తి అయిందని మిగిలిన 28 శాతాన్ని కూడా వారం రోజుల్లో పూర్తి చేసి నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. పాములపాడు, ప్యాపిలి, బేతంచెర్ల, బనగానపల్లి, నంద్యాల అర్బన్, గడివేముల తదితర మండలాల ప్రగతి తక్కువగా వుందని సంబంధిత మండల ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల యూనిట్ల పనితీరును పరిశీలించి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఈవోఆర్డీలను కలెక్టర్ ఆదేశించారు.

గ్రామీణ ఉపాధి హామీ కింద లేబర్ రిపోర్టును గణనీయంగా పెంచాలన్నారు. లక్షం మేరకు కూలీలకు పనులు కల్పించాలని ఏపీడీలను ఆదేశించారు. అమృత్ సరోవర్ కింద గుర్తించిన చెరువులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. క్లస్టర్ల వారీగా ఏప్రిల్ లో ఇచ్చిన లక్ష్యాలను చేసిన పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎన్ఆర్ఈజీఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. స్పందన ఫిర్యాదులకు సంబంధించి ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, డిఎల్డివో జనార్ధన్, హౌసింగ్ పిడి రామశేషు, డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News