స్నేహానికి కన్న మిన్నలోకాన లేదురా.. కడదాక నిను వీడిపోదురా..దోస్త్ మేరా దోస్త్ తూహీ మేరా జాన్వా..స్తవంరా దోస్త్ నీవే నాప్రాణం అంటూ సీనిగేయ రచయితలు స్నేహానికి భాష్య చెప్పారు. స్నేహానికి ఉన్న గొప్పతనం ఎలా చెప్పినా, ఎప్పుడు చెప్పినా ఎన్ని విధాలుగా చెప్పినా తక్కువే..స్నేహం అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పేందుకు ఉదాహర అక్కరలేని..మరుపురాని స్నేహానికి మరిచిపోని అనుభంధానికి నిలివెత్తు రూపం ఈ నిజమైన స్నేహితులు శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి, ఐకాన్స్టార్ అల్లు అర్జున్ని..నిజమైన స్నేహానిక అర్థం చెప్పిన సినీహీరో అల్లు అర్జున్.
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సినీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన స్నేహితుడు నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్రకిషోర్రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు నంద్యాలకు వచ్చారు. నంద్యాలకు చేరుకున్న అల్లుఅర్జున్కు శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని గజమాలతో అపూర్వస్వాగతం పలికారు.
అక్కడ నుండి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ దంపతులు శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి గృహానికి వచ్చారు. వీరికి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి రెడ్డి, నాగని రవిసింగారెడ్డి, శిల్పారెడ్డి, ధరణిరెడ్డిలు ఆత్మీయ స్వాగతం పలికారు. అక్కడ నుండి శిల్పా రవిరెడ్డి అభిమానులకు, అల్లు అర్జున్ అభిమానులకు అభివాదం చేశారు. తన మిత్రుడు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డిని ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ. శిల్పా రవి నాకు రాజకీయాల్లోకి రాక మందు నుండి గత 14 సంవత్సరాలుగా మంచి స్నేహితుడు.. రాజకీయాల్లోకి రాక ముందు ఆయనతో వారానికి, పదిరోజులకు కలిసేవాన్ని అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గత 5సంవత్సరాలుగా కలవడం తగ్గిపోయింది. కారణం ఏంటంటే… శిల్పా రవి రెడ్డి ప్రజలకోసం ఎంతో కష్టపడుతున్నాడని అర్థం అయ్యిందన్నారు. తాను పడుతున్న కష్టాన్ని గ్రహించి మంచి చేస్తున్న మిత్రుడికి మద్దతు తెలియజేయడానికి నంద్యాలకు రావడం జరిగిందన్నారు. గత ఎన్నికల్లో శిల్పా రవి రెడ్డి విజయం సాధించినపుడు ట్వీట్ చేశానని, అభినందించానని, ఇది తనకు సంతృప్తిని ఇవ్వలేదని.. అందుకే ప్రత్యక్ష్యంగా తన సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు రావడం జరిగిందన్నారు. శిల్పా రవిరెడ్డి ఎక్కడ ఉన్నా తన ప్రాణం అంతా నంద్యాలలోనే ఉంటుందని, తాను కష్టపడే విధానం తనకు ఎంతగానో నచ్చిందని ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని, రాజకీయ ప్రస్థానంలో అనేక ఉన్నత స్థానాలను అధిష్టించాలని, తాను చూసి సంతోషించాలని ఆకాంక్షించారు.
శిల్పా రవి రెడ్డి మాట్లాడుతూ.. అల్లుఅర్జున్ పుష్పా-2 సినిమా షూటింగ్ లతో ఎంతో బిజీగా ఉండే వారని, ప్రత్యేకంగా తన కోసం మిత్రున్ని భలపరచాలని, తన సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి దాదాపు 600 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావడం మరచి పోలేనటువంటి ఘటం అన్నారు. అల్లుఅర్జున్ తో కలిసినపుడు ఎప్పుడూ..సామాజిక సేవ గురించి మాట్లాడుతూ ప్రజలకు ఏవిధంగా మంచి చేయవచ్చు అని చర్చించుకొనేవారమన్నారు. సినీహారో అయినా సరే ప్రజలకు మంచి చేయాలని, మనతోపాటు పది మందిని అభివృద్ధిలోకి తీసుకురావాలి, సాయం అందించాలి, తనతోపాటు తనతోటి మిత్రులు అందరు తనలాగే ఉండాలని మంచి ఆలోచనగలిగిన వ్యక్తి అని ప్రశంసలు కురిపించారు.
అల్లుఅర్జున్ తో తనకు దాదాపు 12 సంత్సరాల అనుబంధం ఉందని, కలసి తిరిగేవారమని, తాను రాజకీయాల్లో లేకపోయినా సరే రాజకీయాల్లో ఎలా ధైర్యంగా ముందుకు వెళ్లాలన్న విషయాలను చెబుతూ వెన్నుతట్టి ప్రోత్సహించేవారని తెలిపారు. అలాగే ప్రజలకు ఏవిధంగా మంచి చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తి అన్నారు. తనకోసం తన విజయాన్ని కాంక్షించి మద్దతు తెలిపిన తన మిత్రుడు అల్లు అర్జున్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.