ఆశా వర్కర్స్ కనీస వేతనాలు చెల్లించాలని, పనిభారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సెలవులు, రిటైర్మెంట్, గ్రూప్ న్సూరెన్స్ సౌకర్యం, సంక్షేమ పథకాలు అమలుచేయాలని, ఆశా నియామకాల్లో రాజకీయ జోక్యం తొలగించాలని, ప్రభుత్వమే నియామకాలు జరపాలని, రిటైర్మెంట్ కాలాన్ని 62 ఏళ్ళకు పెంచాలని, రిటైర్మెంట్బినిఫిట్స్ కల్పించిన తరువాతే రిటైర్మెంట్ చెయ్యాలని కోరుతూ 14 15 తేదీలలో 36 గంటలపాటు ధర్నా కార్యక్రమాన్ని ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు వి.ఏసురత్నం, సిఐటియు జిల్లా కార్యదర్శి డి.లక్ష్మణ్, ఆశా వర్కర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రమణకుమారి, అధ్యక్షురాలు నాగమణి, జిల్లా నాయకురాళ్ళు షమీమ్, శివమ్మ, శివలక్ష్మి లతోపాటు జిల్లా నలుమూలల నుండి పిహెచ్సి సెంటర్ నాయకురాళ్ళు, ఆశాలు 600 మందికి పైగా పాల్గొనన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు.
ప్రభుత్వం వీరి సేవలను గుర్తించి కార్మికులుగా గుర్తించాలని ఇతర సౌకరక్యాలను కల్పించాలని కోరుతున్నాము. 60 సంవత్సరాలు వయస్సు వచ్చేవరకు పనిచేయించుకొని ఆశావర్కర్స్కు ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించకుండానే తొలగించటం సరైంది కాదన్నారు. 62 సం. రిటైర్మెంట్ జిఓ వర్తింపచెయ్యాలని, విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు, అనారోగ్యంతో చాలా మంది ఆశా వర్కర్లు అర్ధాంతరంగా చనిపోతున్నారు. ప్రభుత్వం ఆశా వర్కర్స్కు గ్రూప్న్సూరెన్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్న ఆశాలుగా మార్పు చేయాలని కోరుతున్నాము.ఆశావర్కర్స్ ని రోజు విలేజ్ క్లీనిక్ & సచివాలయాలలో ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉండాలని, క్లినిక్ లు క్లీన్ చేయటం, ఓపీ వర్క్, అటెండర్ పనులు చేయించడంతో పాటు ఉదయం సాయంత్రం రెండు సార్లు రిజిస్టర్ లో సంతకాలు చేయాలని అధికారులు వేదిస్తున్నారు. రికార్డ్స్ సొంత డబ్బులు పెట్టి కొనాలని, సంబంధం లేని ఆన్లైన్ వర్క్ లన్ని సొంత ఫోన్ ద్వారా చేయాలని వేధిస్తున్నారు. సెలవులు లేకపోవడంతో అనారోగ్యాలపాలౌతున్నారు. ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు చేయించటం ఆపాలి..ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలని ఈ డిమాండ్స్ చేశారు. ఆశా వర్కర్స్ కనీస వేతనం చెల్లించాలి. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశాలుగా మార్పుచేయాలి. పనిభారాన్ని తగ్గించాలి. మొబైల్ వర్క్ శిక్షణ ఇవ్వాలి. రికార్డ్స్ లేదా ఆన్లైన్ ఒక పని ఒకసారి మాత్రమే చేయించాలి. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. (ఏ కారణంతో మరణించిన రిటైర్మెంటెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలి. వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి. 62 సం. రిటైర్మెంట్ జిఓని వర్తింపచెయ్యాలి. ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవ్, వేతనంతో కూడిన మెటర్నటీ లీవ్ అమలు చెయ్యాలి.ప్రభుత్వ సంక్షేమ పధకాలు అమలు చెయ్యాలి. ఇళ్ళు లేని వారికి ఇళ్ళ స్థలాలు, ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి.కోవిడ్ కాలంలో (2020 మార్చి నుండి) మరణించిన ఆశాలకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియో ఇవ్వాలి. మరణించిన కుటుంబంలో అర్హులైన వారిని ఆశాలుగా తీసుకోవాలి.ఎఎన్ఎం, హెల్త్ సెక్రటరీల నియామకాలలో ఆశాలకు వెయిటేజ్ని ఇవ్వాలి. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయిన నేటి వరకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయలేదు. ఇప్పటికైనా స్పందించకుంటే చలో విజయవాడకు సిద్దం అవుతామని హెచ్చరించారు.