నంద్యాల జిల్లా అటవీశాఖా అధికారి ఆదేశాల మేరకు బండిఆత్మకూరు మండల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎన్.నాసిర్ ఝా అధ్వర్యంలో ప్రభుత్వము చేపట్టిన లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమాన్ని ఏ.కోడూరు, కరిమెద్దెల, జిసి పాలెం, సంతజూటూరు గ్రామాలలో అటవిశాఖా సిబ్బంది అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతినిత్యం ఉపయోగించే వస్తు వ్యర్థాలతో పర్యావర్ణం కలుషితం కాకుండా ఇంధన పొదుపు, నీటి పొదుపు, భూమి కాలుష్యం కాకుండా అవసరం మేరకు వస్తువులు వాడటం, ప్లాస్టిక్ వస్తువుల వాడకం ఆపివేయటం అధికంగా చెట్లను నాటడం, నీటి వనరులు కలుషితం కాకుండా చూడటం, బయోగ్యాస్ ప్రెషర్ కుక్కర్లు వాడకం, ఇంధన పొదుపుకై, CNG/ E .V వాడటం, పెసర, మినుము లాంటి వాణిజ్య పంటలను తరచుగా వెయ్యటం, ప్లాస్టిక్ వస్తువును రీసైక్లింగ్ చూసి తిరిగి వాడటం వాటర్ టాప్స్ లీకేజీలను నియంత్రించటం వంటి పలు అంశాలపై ప్రజలకి అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణ బాధ్యత చేపట్టిన మానవ మనుగడ సులభతరమవుతుందని, జీవన శైలిలో వ్యర్థాలను సృష్టించే వనరుల ఉపయోగాన్ని తగ్గించాలని ఆయా గ్రామాల ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అటవీ సిబ్బంది, ఎఫ్.ఎస్.ఓలు, పి.సుబ్బయ్య, ఎస్. రవీంద్ర నాయక్, ఎఫ్ .బిలు, మదార్ సాహెబ్, రామకృష్ణ, వెంకటరమణ, హైమావతి, ప్రసన్నలు పాల్గొన్నారు.
Nandyala: పర్యావరణం కాలుష్యంపై ఫారెస్ట్ శాఖ అవగాహనా కార్యక్రమాలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES