Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: ఘనంగా బసవేశ్వర జయంతి

Nandyala: ఘనంగా బసవేశ్వర జయంతి

నంద్యాల జిల్లా కేంద్రంలో బసవేశ్వర జయంతి ఘనంగా నిర్వహించారు. బైర్మల్ వీధిలోని బసవేశ్వర ఆలయంలో సంఘసంస్కర్త పరమాత్మ బసవేశ్వర స్వామి జయంతి ఉత్సవాలను వీరసేవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు శశిభూషణ సిద్ధాంతి, వీరశైవ సంక్షేమ సమాజం అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ సమాజంలో కులాలను మతాలను రూపుమాపేందుకు తొలి అడుగు వేసిన మొట్టమొదటి సంఘసంస్కర్త బసవేశ్వరుడు అన్నారు. ప్రతి ఒక్కరికి లింగ ధారణ చేసి శివతత్వాన్ని బోధించారు. అనంతరం పురవీధుల గుండా స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. కమిటీ సభ్యులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News