Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: వాలంటీర్లకు వందనం

Nandyala: వాలంటీర్లకు వందనం

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ అన్నారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది చేపట్టిన ”వాలంటీర్లకు వందనం కార్యక్రమం” పై విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో ప్రసారమైన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ తో పాటు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, డిఎల్డిఓ జనార్ధన్, సంబంధిత అధికారులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ గ్రామ వార్డు వాలంటీర్లు ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికి అందజేయడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారన్నారు. వారు చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది వాలంటీర్లకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ పరిణామన్నారు.

- Advertisement -

ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామంలోనే ప్రజల ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలను చేరవేస్తున్న వాలంటీర్ల సేవలు వెలకట్టలేని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా వాలంటీర్లు బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మరింత మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లాలో సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాలు పొందిన గ్రామ వార్డు వాలంటీర్లు 8082 మంది వున్నారన్నారు. సేవా వజ్ర నగదు పురస్కారం పొందిన 32 మందికి సర్టిఫికేట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ తో పాటు రూ.30 వేల బహుమతి, సేవా రత్న నగదు పురస్కారం పొందిన 179 మందికి సర్టిఫికేట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ తో పాటు రూ.20 వేల బహుమతి, సేవా మిత్ర పురస్కారం పొందిన వారు 7871 మందికి సర్టిఫికేట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ తో పాటు రూ.10 వేల బహుమతి ప్రధానం ఉంటుందన్నారు.అనంతరం ఉత్తమ సేవ అందించిన కే.ప్రదీప్, పి.వసుందర, పి.శివ కుమార్, ఎస్.రబియ, రియాజ్ ఖాన్, ఎం.శ్వేత, ఎస్.మహబూబ్, ఎస్.ఖరీముల్లా, నరసింహ రెడ్డి, ఎం.అనిత, జే.భాస్కర్ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్రా, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలను కలెక్టర్, ఎమ్మెల్యే, తదితర ముఖ్య అతిథులు ప్రధానం చేశారు.సేవా మిత్రా, సేవా రత్న, సేవా వజ్ర వచ్చిన వారినందరినీ అభినందిస్తున్నామని.. పురస్కారం పొందడంతో మరింత బాధ్యత పెంచుతుందని కలెక్టర్ గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News