Friday, April 18, 2025
Homeఆంధ్రప్రదేశ్Nandyala: రైతు గ్రూపులకు ట్రాక్టర్ ల పంపిణీ

Nandyala: రైతు గ్రూపులకు ట్రాక్టర్ ల పంపిణీ

నంద్యాల కలెక్టరేట్ లోని వైయస్సార్ సెంటినరీ హాల్ ఆవరణలో వైయస్సార్ యంత్ర సేవా పథకం క్రింద రైతు గ్రూపులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు ఇతర వ్యవసాయ పనిముట్లు జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సమూన్ పంపిణీ చేశారు. వైయస్సార్ సెంటనరీ హాలులో గుంటూరు జిల్లాలోని చుట్టుగుంట సర్కిల్లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద వైయస్సార్‌ యంత్రసేవా పథకం మెగా మేళా –2లో భాగంగా రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు రాష్ట్రస్ధాయి పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తో పాటు ఎమ్మెల్సీ ఈసాక్ భాషా, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ పి. పి నాగిరెడ్డి, జాయింట్ కలెక్టర్ నిశాంతి. టి తదితరులు వీక్షించారు. అనంతరం రాయితీ మొత్తంతో కూడిన చెక్కును రైతులకు అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News