Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: మల్లికార్జున రిజర్వాయర్ కమిటీని ఏర్పాటు చేస్తాం

Nandyala: మల్లికార్జున రిజర్వాయర్ కమిటీని ఏర్పాటు చేస్తాం

సర్వే పనులు ప్రాథమిక దశలోనే వున్నాయన్న కలెక్టర్

ఓర్వకల్లు – మిడుతూరు మండలాలలో నిర్మించనున్న మల్లికార్జున రిజర్వాయర్ నిర్మాణ పనులకు సంబంధించి సర్వే పనులు ప్రాథమిక దశలోనే వున్నాయని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలానీ సమూన్ వెల్లడించారు. కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటినరీ హాల్ లో స్పందన కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానందరెడ్డి, శ్యాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధారెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.మల్లికార్జున రిజర్వాయర్ వద్దు.. మా పొలాలు మాకు ముద్దు అన్న నినాదాలతో సంబంధిత మండలాల గ్రామాల రైతులు వైఎస్ఆర్ సెంటినరీ హాల్ ముందు ప్రధాన రహదారిలో గని, శకునాల, చింతలపల్లి, సున్నంపల్లి తదితర గ్రామాల రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

- Advertisement -

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ దాదాపు 16 టియంసిల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించనున్న మల్లికార్జున రిజర్వాయర్ నిర్మాణ పనులకు సంబంధించి సర్వే పనులు ప్రాథమిక దశలోనే వున్నాయని రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఇందుకు సంబంధించి సర్వే పనులు జరుగుతున్నాయని ఎక్కడ నిర్మించాలన్నది ఇంకా ఖరారు కాలేదని కలెక్టర్ తెలిపారు.రిజర్వాయర్ నిర్మాణ పనులకు సంబంధించి ప్రజాప్రతినిధులు, స్థానిక రైతులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి స్థానిక రైతులు, ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తామని కలెక్టర్ రైతులకు వివరించడతో రైతులు ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నిశాంతి.టి, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటరమణయ్య, య్యఎస్సార్బీసీ ఈఈ శుభకుమార్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News